వ్రాసినది: శ్రీవాసుకి | మే 3, 2010

హమ్మయ్య నేను సినిమా చూశాను….

హమ్మయ్య సంవత్సరం తర్వాత రెండు రోజుల క్రితం మా పెళ్ళిరోజు పురస్కరించుకొని నేను, నా శ్రీమతి కలిసి సినిమాకి వెళ్ళాము. మేము ఆఖరిగా చూసిన చిత్రం అరుంధతి. ఇదిగో మళ్ళీ ఇప్పుడు. సినిమాకి సంవత్సరమా అని నవ్వుకోకండే. ఏమిటో అలా అయిపోయింది మా పరిస్థితి. మొత్తనికి మొన్న తెగించి సినిమా చూడాలన్న కృతనిశ్చయంతో ఆఫీస్ కి సగం రోజు సెలవు పెట్టి మా మూడేళ్ళ ముద్దుల ముదురు టెంకని (పాపని) మభ్యపెట్టి తాత,నాయనమ్మల దగ్గర వదిలి జగన్నాధ రథ చక్రంలా కదిలి వెళ్ళాము. ముందు తిన్నగా షాపింగ్ కి వెళ్ళి కావల్సిన చిన్న ఐటంలు కొనుక్కొని అటునుంచి కాసేపు గోదావరి పుష్కర ఘాట్ కి వెళ్ళి గోదావరి గాలి ఆస్వాదించి వేడిగా ఛాట్, చల్లగా ఐస్ క్రీం తిని 6 గంటలు అయిన తర్వాత థియేటర్ దగ్గరికి వెడితే చావు కబురు చల్లగా తెలిసింది. ఏం మాయ చేసావే చూద్దామని మేము వెడితే తెలుగుదేశం పార్టీ వారు, అభిమానులు ప్రత్యేకంగా సింహ సినిమా మొదటి ఆట వేయించుకొంటున్నారని అందుకని ఏం మాయ చేసావే రెండో ఆటగా వేస్తారని తెలిసింది. అంతే మనసు ఉసూరుమనిపించింది. తన మొహంలో అప్పటికే నా మీద ఒక రకమైన కోపం కలిగింది. ముందే తెలుసుకోకుండా అలా తీసుకొచ్చానని. నాకు మాత్రం ఏమి తెలిసి చచ్చు. అలాగని సింహ చూసే ధైర్యం చేయలేదు. ఆసరికే బాలయ్య బాబు 500 వందలమందిని టోకున నరికాడని తెలిసింది. మగధీరలో రాంచరణ్ 100 మందిని చంపాడు కదా. మరి ఆ లెక్క దాటించాలి గదా. పెళ్ళిరోజు ఈ చావుగోల ఏమి చూస్తాములే అని ఆలోచించి శ్రీమతిగారికి అవకాశమిచ్చి సినిమా చెప్పమన్నాను. రెండో మాట లేకుండా వరుడు అంటే ఐదు రోజుల పెళ్ళి కదా అనిచెప్పి ఒక కిక్ తో బండి స్టార్ట్ చేసి అటుకేసి దూకించాను. వెళ్ళి చూస్తే థియేటర్ చాలా ఖాళీగా ఉంది. లోపలికి పోయి కూర్చున్నాము. కాసేపటికి కొద్దిగా హాలు నిండింది. మా పెళ్ళిరోజు పెళ్ళికి సంబంధించిన సినిమా అదీ ఐదురోజుల పెళ్ళి కదా అని ఆతృతతో చూస్తే తుస్ అనిపించాడు. పెళ్ళికి సంబంధించి పెద్దగా ఏమి చూపించలేదు. అన్ని సినిమాలలో ఉన్నట్టే మాములు పెళ్ళి సీన్స్ అంతే. థ్రిల్లింగ్ ఏమంటె హీరో హీరోయిన్లు ఒకరిని ఒకరు పెళ్ళి పీటల మీద చూసుకోవడం బాగుంది. అదొక్కటే నాకు నచ్చింది. ఇక సెకండాఫ్ చూసిన చూడకపోయినా ఫర్వాలేదు. ఫస్టాఫ్ అంతా పరమాన్నంలా తీయగా ఉంటే, సెకండాఫ్ పచ్చిమిరపకాయలా కారంగా ఉంది. అలా కాకుండా వేరేగా అందంగా తీసుంటే బాగుండేదేమో. ఐదు రోజుల పెళ్ళి అని ఊరించినందుకు ఆ సన్నివేశాలు పెంచుంటే బాగుండేది. ఏం చేస్తాం మన చేతిలో పనా. ఏమైతేనే మా సినిమా కార్యక్రమం పూర్తయింది. సంతోషం. మేము సినిమా చూస్తామని నిరూపించాను. ఇక శ్రీమతిగారి మరో చిన్న కోరిక ఏం మాయ చేసావే. ఈ ఆదివారం మా బుజ్జిపండుని మాయ చేసి ఈ సినిమా చూడాలి. చూస్తాం. సెలవు మరి.


స్పందనలు

  1. nijam cheppaaru.mana godavari lo jarige pellillu maximum alagey vuntai.indulo kottha ga chusi chachindi emi ledu.maku maree darunamandi.pelli ayyi 9 nelalu ayindi.ippati varaku okka cinema kuda ledu.rasipetti vundali.

    • @శ్రీదేవి గారు

      మీ స్పందనకు ధన్యవాదాలు. సినిమా వరకు ఐతే చెప్పుకోవాడానికి ఏమిలేదు. ఐదు రోజుల పెళ్ళి తంతు లేనేలేదు. అయ్యో మీరు మాలాగే సినిమా చూడలేకపోతున్నారన్నమాట. ఈసారి కొంచెం గట్టిగా సంకల్పించుకోండి.

  2. పాపని మభ్య పెట్టి సినిమాకు వెళ్ళారుగా అందుకే చూడలేక పోయారు … నా మాట విని బుజ్జి పండుని కూడా తీసుకెల్లండి ఈ ఆదివారం 🙂

    • @కౌండిన్య గారు

      మీ స్పందనకు ధన్యవాదాలు. మా బుజ్జిపండు ఎప్పుడూ మాతోనే ఉంటుందండీ. ఈసారికి పెళ్ళిరోజని మినహాయింపు ఇచ్చాము. వదిలి వెళ్ళడం మాకు ఇష్టం ఉండదు. యమా యాక్టివ్. టి.వి ప్రకటనలన్నీ చదివేస్తుంది. సుందరకాండ, మొగలిరేకులు సీరియల్స్ పాటలు పాడుతుంది. అంతా కాదులెండి. ఏదో ముద్దుగా. సంతూర్ సబ్బుని నంతూర్ నంతూర్ అని అంటుంది.

    • Ha ha…Koundinya gaaroo… mee reply bhale undi. Bujji talli ni mosam ante mari. 🙂 Ha ha. NIce. Nice.

      Chandu

  3. మీ ‘స్వీట్ హోం – సినిమా ముచ్చట్లు ‘బావున్నాయి

  4. అయితే మీరు స్వీట్ హోం లో బుచ్చిబాబు టైపన్నమాట….. హ హ హ బావున్నాయి మీ స్వీట్ హొమ ముచ్చట్లు. మీకు మూడేళ్ళ పాప ఉంది అంటేనే తెలుస్తున్నాది మీకు సినిమాకి వెళ్ళడం ఎందుకు కుదరట్లేదో !

    • @ సౌమ్యగారు

      మీ స్పందనకు ధన్యవాదాలు. ఆ స్వీట్ హోం బుచ్చిబాబు ఎవరో నాకు తెలియదనుకోండి, పరిచయం కూడా లేదు. అయినా ఆ మాట విన్నాను ఒకసారి. పిల్లలున్నాకా తప్పదు కదండీ. అయినా మా అమ్మాయి బుద్ధిమంతురాలే. వేరే కారణాల వల్ల చూడటం సాధ్యం కాలేదు.

      • అంటే పిల్లలు అల్లరిపెడతారని కాదండీ, కానీ అంత చిన్న పిల్లలని వదిలి వెళ్ళడం అంటే కష్టం కదా అని నా ఉద్దేస్యం 🙂

        • @సౌమ్య గారు
          సాధారణంగా మా పాపని వదిలి వెళ్ళము. కేవలం పెళ్ళిరోజు కదా అని ఈసారికి మినహాయింపు ఇచ్చాము. అంతేగాక రాత్రిపూట చల్లగాలి తనకు పడదు. వెంటనే జలుబు పట్టి 5,6 రోజులు ఇక పరుగులే. మేము మా ఊరు నుంచి 25 కి.మి వెళ్ళి సినిమా చూడాలి. అందుకే ఈ మినహాయింపు. మేము బెంగ పెట్టుకొంటాముగాని పాపకి ప్రస్తుతానికి అంత బెంగ లేదు మమ్మల్ని వదిలి 10రోజులు అమ్మమ్మగారింట్లో ఉంది.

  5. baagundi

  6. చల బావుంది

  7. మీకు ఆలస్యంగా పెళ్లి రోజు శుభాకా౦క్షలు తెలియజేస్తున్న౦దుకు మన్ని౦చ౦డి. ఏదేమైనా ఆ రోజు గోదావరి గాలి సతీ సమేత౦గా హాయిగా పీల్చగలిగిన౦దుకు కూడా శుభాకా౦క్షలు.

    • @సామాన్యుడుగారు

      మీకు స్పందనకు హృదయపూర్వక ధన్యవాదాలు. గోదావరి గాలి ఆనందమే వేరు మరి.

  8. లేటయినా మీ వివాహ వార్షికొత్సవ శుభాకాంక్షలు. బాగుంది ఆ రోజు మీ అనుభవాల వ్యాహ్యాళి. .ఏ అడ్డంకులూ లేకుండా ఏం మాయ చేసావె సినిమా చూడ గలరని శుభాకాంక్షలు….రద్దీలో జాగ్రత్త. మీ చిట్టి తల్లినీ యీసారి తీసికెళ్ళంది అప్పటి దాకా సినిమా చూడొద్దా అని మీరన్నారనుకోండి.. నేనేమీ చెప్పలేను. వుంటా ..మరి ..శ్రేయోభిలాషి. గిజిగాడు.

    • @రాఘవేంద్రరావు గారు
      ధన్యవాదాలు. ఈసారి మా బుజ్జిపండుని తీసుకొని వెళ్ళి ఏం మాయ చేసావే చూస్తాం. అందుకు ఆదివారం ముహుర్తం పెట్టాము

  9. బావుందండీ సినిమా ప్రహసనం.

    • @ కొత్తపాళీ గారు

      నా బ్లాగ్ దర్శించినందుకు ధన్యవాదాలు. చాలా రోజులుగా మీ పేరు వింటూనే ఉన్నాను. ఇన్నాళ్ళకి నా బ్లాగ్లో కామెంటేశారు. ఆనందంగా ఉంది.

  10. Naaku koodaa varudu cinema first half maatrame nachhindi. Vadhuvu, varudu pelli lone okarikokaru choosukovatam nijam gaa kotha anubhooti laa undi.

    Baagundi ShreeVaasuki gaaroo mee post.

    I forwarded this to my sister. 🙂

    Mee…
    Chandu

    • చందు గారు

      మీ అన్ని వ్యాఖ్యలకు, నా టపాలు నచ్చినందుకు నా హృదయపూర్వక ధన్యవాదాలు. మీ సిస్టర్ కి ఫార్వర్డ్ చేసినందుకు కూడా. ఎలా వున్నారు. ఈ మధ్య ఏమి వ్రాయడంలేదేమి. నాకు ఖాళీ ఉండటం లేదు. బ్లాగ్లు చూస్తున్నానుగాని వ్రాయటంలేదు.


స్పందించండి

Fill in your details below or click an icon to log in:

వర్డ్‌ప్రెస్.కామ్ లోగో

You are commenting using your WordPress.com account. నిష్క్రమించు /  మార్చు )

ఫేస్‌బుక్ చిత్రం

You are commenting using your Facebook account. నిష్క్రమించు /  మార్చు )

Connecting to %s

వర్గాలు

%d bloggers like this: