వ్రాసినది: శ్రీవాసుకి | మార్చి 31, 2010

వేదంలా ఘోషించే గోదావరి…!

           ఆంధ్రకేసరి చిత్రంలోని ఈ పాటంటే నాకు ఇష్టం. మీ కోసం ఇక్కడ.

వేదంలా ఘోషించే గోదావరీ
అమరదామంలా శోభిల్లె రాజమహేంద్రీ
శతాబ్దాల చరిత గల సుందర నగరం
గతవైభవ దీప్తులతో కమ్మని కావ్యం

రాజ రాజ నరేంద్రుడు, కాకతీయులు
తేజమున్న మేటి దొరలు రెడ్డి రాజులు
గజపతులు నరపతులు ఏలిన ఊరు
ఆ కథలన్ని నినదించె గౌతమి హొరు ||వేదంలా||

ఆది కవిత నన్నయ్యా రాసెనిచ్చటా
శ్రీనాధ కవి నివసం పెద్ద ముచ్చటా
కవిసార్వభౌమలకిది ఆలవాలము
నవ కవితలు వికసించె నందనవనము ||వేదంలా||

దిట్టమైన శిల్పాల దేవలాలు
కట్టుకదల చిత్రాంగి కనక మేడలు
కొట్టుకొని పోయె కొన్ని కొటిలింగాలు
వీరేశలింగమొకడు మిగిలెను చాలు ||వేదంలా||

వేదంలా ఘోషించే గోదావరీ
అమరదామంలా శోభిల్లె రాజమహేంద్రీ
శతాబ్దాల చరిత గల సుందర నగరం
గతవైభవ దీప్తులతో కమ్మని కావ్యం ||వేదంలా||


స్పందనలు

  1. పాట వివరాలు వ్రాశారు కాబట్టి, ఇటువంటి బ్రహ్మాండమైన పాట రచించిన ‘ఆరుద్ర’ గారినీ, శ్రీ రమేష్ నాయుడు, శ్రీ ఎస్.పి.బి ని కూడా సంస్మరిస్తే ఇంకా బాగుండేది. మంచి పాట వినిపించినందుకు చాలా సంతోషం.

  2. yes, this is the one of the best songs which i heared.
    Thanks a lot for sharing the lyrics

  3. ధన్యవాదాలు. నేను వరంగల్లులో పుట్టి పెరిగినా ఈ పాట నన్ను పులకింపజేస్తుంది. ఇక ఈ పాటను విన్నప్పుడు రాజమండ్రి వాళ్ళ మానసికస్థితి ఎలా ఉంటుందో అని ఎప్పుడూ ఆలోచిస్తుంటాను. ఎవరైనా రాజమండ్రి వాళ్ళు స్పందిస్తే బాగుంటుంది.

    • @శంకరయ్య గారు సంగీతానికి ప్రాంతీయ భేధాలు, వయో భేధాలు లేవు. అది ఎవరి మనసునైనా రంజింపచేస్తుంది. ఈ పాట మీకు నచ్చినందుకు, మీ స్పందనకు ధన్యవాదాలు.

  4. thanks for this post.i too liked this very much.

  5. “వేదంలా ఘోషించే గోదావరీ-” ఇది తెలుగు ప్రజలను జీడిరసంలా పట్టుకున్నది.
    దానికి అర్థం లెదు సందర్భము లెదు. పాటకు మంచి ట్యూనె వలన హిట్ అయ్యింది.
    వేదఘోష స్రావ్యంగా వుంటుందా లెద గడిబిడిగా వుంటుందా యెవరికి నచ్చుతుంది.
    ఈ ఘోష ఒక్కొక్కమారు ఒక్కక్క విధంగా వినిపిస్తుంది.
    వేదము అనేసరికి తిరుగులేనిది అందమైనది ప్రామానికము అనె భావజాలం వల్ల ఇది నచ్చుతుంది
    ఘోష – సాధరనముగా మంచి అర్థములో వాడరు.

    “గల గల పారుతున్న గోదారి లా” మంచి ప్రయోగము

    • @చిత్రలేఖ45 ముందుగా స్పందనకు ధన్యవాదాలు.

      ఈ పాటకు అర్థం లేకపోలేదు. ఇది రాజమండ్రి చరిత్రని క్లుప్తంగా చిన్న మాటలలో చెప్పిన పాట. ఇక ఎంత గొప్ప పాటైనా శ్రోతలు వినేలా ఆకట్టుకోవాలంటే మంచి ట్యూన్ ఉండాలి. వేదఘోష శ్రావ్యమా, గడిబిడా అన్నారు. అదెప్పుడూ శ్రావ్యమే. సాధారణంగా గుడులలో మాములుగా చదువుతారు. వేదమెప్పుడూ ఆరోహణ, అవరోహణ క్రమంలో ఉంటుంది. మంచి వేదపండితుల దగ్గర గాని, కంచి పీఠం వంటి చోట్లగాని మీరు చక్కని వేదస్వరం వినగలరు. ప్రయత్నించండి.

  6. శ్రి వాసుకి గారు, ఈ పాట రాజామండ్రీ గురించి వచ్చిన మంచి పాట. మీకు నా ధన్యవాదాలు

  7. వెంట్రుకలు నిక్కబొడుచుకుంటాయి ఆ పాట వింటూ వుంటె. రచన, సంగీతం, గానం, ఆర్కెస్ట్రా, అన్నీ అత్యధ్భుతమే. చక్కని పాటని గ్నప్తికి తెచ్చారు. …గిజిగాడు.


Leave a reply to Ramana స్పందనను రద్దుచేయి

వర్గాలు