వ్రాసినది: శ్రీవాసుకి | ఫిబ్రవరి 28, 2010

పవిత్ర క్షేత్రంలో అపవిత్ర మనసులు

తిరుమల శ్రీవారి దర్శనానికి వెళ్ళి క్యూ వరసలో నిల్చున్న ఒక అమ్మాయిని అక్కడున్నటువంటి సెక్యూరిటీ సభ్యుడొకరు ఆమె ఛాతిపై చేయి వేసి నెట్టాడని టి.వి 9 లో వార్త. తన ఎదురుగా ఉన్నది అమ్మాయో, అబ్బాయో తెలుసుకోలేనంతగా ఉన్నాడన్నమాట. ఆ అమ్మాయి ఫిర్యాదు చేయబోతే అధికారులెవ్వరూ సరిగ్గా స్పందించలేదుట. పైపెచ్చు ఏ తప్పు జరగలేదని కితాబు. కొద్ది రోజులక్రితం ఒకామె గుడి చుట్టూ అంగప్రదక్షిణలు చేస్తుంటే ఒక సెక్యూరిటీ సిబ్బంది ఆమెను అసభ్య పదజాలంతో తిట్టి బయటకు పొమ్మన్నాడుట. స్వామి దర్శనానికి గర్భగుడిలోకి వెడితే అక్కడా అంతే మెడ పట్టుకొని లాగేస్తుంటారు. పవిత్ర క్షేత్రంలో దైవ సన్నిధిలో పనిచేస్తున్నామన భావన వారిలో ఏకోశాన ఉండదు. భక్తి భావం, సేవా భావం, ఇంగిత జ్ఞానం లేనివాళ్ళు ఆలయ చైర్మన్లుగా, అధికారులుగా ఉంటే వారి క్రింద పనిచేసే సిబ్బంది కూడా అలానే ఉంటారు. ఇంక మంచి మర్యాదలేమి తెలుస్తాయి. తప్పుకి శిక్ష లేకపోతే ఎవరైనా అంతే.


స్పందనలు

  1. avunu bhagavamtudi aalayamlo apavitra paalakulu cheyibedite ilaamti phalitaale umtaayi

    • మీరన్నది నిజమే. పూర్వంలాగా ఆలయ నిర్వహణ ఏవైనా మఠాలకు అప్పజెప్పి, వ్యవహారాలన్ని పారదర్శకంగా ఉండేలా చూస్తే మంచిది. ప్రభుత్వ ఏలుబడిలో ఉంటే అంతా రాజకీయమైపోతోంది. సామాన్యులకు దేవుడు అందనివాడైపోయాడు. కష్టపడి అంతదూరమెడితే మిగిలేవి ఛీత్కారాలు, అవమానాలు. మీ ప్రతిస్పందనకు నా ధన్యవాదాలు.

  2. What else you expect from a “liquor baron’s” empire ?

  3. తిరుమల – తిరుపతి పుణ్య క్షేత్రాన్ని ప్రత్యేకంగా కేంద్రపాలిత హిందూ ప్రాంతంగా ప్రకటించి హిందువులకే పరిపాలనాధికారం ఇస్తే పరిస్థుతులు ఏమైనా బాగుపడవచ్చు.

    • మీ ప్రతిస్పందనకు ధన్యవాదాలు.

      ఒక హిందూ దేశంలో మన ఆలయ పరిస్థితి ఇలా అయిపోయిందన్న మాట. ముందు అసలు హిందువులలో జడత్వం తొలిగి చైతన్యం రావాలి. మనం దేనికి స్పందించము. ప్రతి దానికి కర్మ సిద్ధాంతం చెపుతాము. అందుకే ఈపరిస్థితి. ఇప్పుడు పాలిస్తున్నది హిందువులే. కాని నాస్తిక, పరమత అభిమానం గల హిందువులు. సనాతన ధర్మం పట్ల ఏమాత్రం గౌరవం లేనివారు. “ప్రత్యేకత ” ప్రకటించాల్సిన అవసరం లేదు కాని ప్రభుత్వ అజమాయిషీ లేకపోతే సరి. రాజకీయ నాయకులకి ఎలాంటి పదవులు ఇవ్వకూడదు. ఏదైనా పీఠానికి గాని, మఠానికి గాని ఆలయ వ్యవహారాలు అప్పజెప్పి, పారదర్శకత ఉండేటట్టు చూడాలి. ప్రభుత్వం తన తరపుగా నిబద్దత గల ఉన్నతాధికారులని ముఖ్యంగా ఆలయ, ఆగమన శాస్త్ర నిబంధనలు తెలుసున్నవార్ని ఎవరైనా పరిశీలకులుగా పెడితే సరిపోతుంది.

  4. at least they should provide some lady security in such heavy crowded areas

    Tv 9 they need news nothing else overrated channel
    the incident may be true
    the community should will get all authority than giving it to this politicians

    god heals everything

    • కిరణ్ గారు మీ ప్రతిస్పందనకు ధన్యవాదాలు.
      మహిళ సెక్యూరిటి ఉంటే మంచిదే. ఇంత వివాదం కాకపోను. ఇక్కడ మరో సమస్య ఏమంటే సిబ్బంది యొక్క దురుసు ప్రవర్తన. కొంత మర్యాద పాటిస్తే సరిపోయేది.

      టి.వి 9 అంటారా రేటింగ్స్ కోసం వాళ్ళపాట్లు వాళ్ళు పడుతుంటారు. నాకొక్కసారి అనిపిస్తుంది వీళ్ళు కావాలని తిరుపతిని లక్ష్యంగా చేసుకున్నారా అని. వీళ్ళది అదో తరహా లౌకికవాదం.

  5. శ్రీ వాసుకి గారూ,
    ఆగమన శాస్త్రం కాదండీ..ఆగమ శాస్త్రం.
    ఆడ పిల్లలకు నాదో సలహా…మిడ్డీలూ జీన్స్ లూ టీ షర్ట్ లూ వేసుకొని రాకుండా ఉంటే, ఆ వాతావరణం లోని దివ్యత్వాన్ని భంగపరచని వారౌతారు…

    • తప్పును సరిదిద్దినందుకు ధన్యవాదాలు. తెలుసున్న పదమే అయినా తప్పు దొర్లిపోయింది. ఇక ఆడపిల్లల గూర్చి అంటారా మనం వద్దు అంటే వింటారా..మా బట్టలు మా ఇష్టమంటారు. చూడడం ఇష్టం లేకపోతే కళ్ళు మూసుకోమంటారు. సమస్యేమంటే త్రాగుబోతులు. వాళ్ళకి దేవుడక్కర్లేదు. కాలక్షేపరాయుళ్ళు అంతే. అయినా అందులో వ్రాసానుగా మనమందరం ఆలయ మర్యాదలు తెలుసుకొని మసులుకొంటే పద్దతిగా బాగుంటుందని.


Leave a reply to శ్రీవాసుకి స్పందనను రద్దుచేయి

వర్గాలు