వ్రాసినది: శ్రీవాసుకి | నవంబర్ 3, 2010

మా తెలుగు తల్లికి- టంగుటూరి సూర్యకుమారి

నవంబర్ 1 మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అవతరణ. ఈ వీడియో ఆరోజే పెట్టాలనుకొన్నా కాని వేరే కారణాల వల్ల కుదరలేదు. అందుకే ఇప్పుడు మనందరి కోసం ఇక్కడ ఆనాటి మధుర తెలుగు గీతం. ఈ గీత రచన చేసినది శంకరంబాడి సుందరాచారి. పాడినది టంగుటూరి సూర్యకుమారి గారు. ఆమె టంగుటూరి ప్రకాశం పంతులు గారి బంధువు. 1942లో వచ్చిన దీనబంధు అనే సినిమా కోసం వ్రాసిన ఈ గీతం చాలా ప్రసిద్ధి చెంది తర్వాత ఆంధ్రరాష్ట్ర అధికార గీతంగా గుర్తింపు పొందింది. ఇక్కడున్న ఈ రెండు పాటలు టంగుటూరి సూర్యకుమారి గారు పాడినవే. ఇంకోటి వేరే సందర్భంలో బర్మింగ్ హమ్మ్ లో 1985 లో పాడినది. సూర్యకుమారి గారు 25 నవంబర్ 1925 లో పుట్టి ఏప్రిల్ 2005లో మరణించారు.

1.

2.

మా తెలుగు తల్లికి మల్లెపూదండ, మా కన్నతల్లికి మంగళారతులు,

కడుపులో బంగారు కనుచూపులో కరుణ,  చిరునవ్వులో సిరులు దొరలించు మాతల్లి.

గలగలా గోదారి కదలిపోతుంటేను,  బిరాబిరాక్రిష్ణమ్మ పరుగులిడుతుంటేను

బంగారు పంటలే పండుతాయీ, మురిపాల ముత్యాలు దొరులుతాయి.

అమరావతినగర అపురూప శిల్పాలు,  త్యాగయ్య గొంతులో తారాడు నాదాలు

తిక్కయ్య కలములొ తియ్యందనాలు నిత్యమై నిఖిలమై నిలచి వుండేదాకా

రుద్రమ్మ భుజశక్తి మల్లమ్మ పతిభక్తి   తిమ్మరసు ధీయుక్తి, కృష్ణరాయల కీర్తి

మా చెవులు రింగుమని మారుమ్రోగేదాక 

నీపాటలే పాడుతాం ,నీ ఆటలే ఆడుతాం

జై తెలుగు తల్లి ,జై తెలుగు తల్లి ……


Responses

 1. సూర్యకూమరి గారిని చూస్తూ పాట వినడం చాలా బావుందండీ thanks!

 2. డియర్ శ్రీవాసుకీ ,ఎలా వున్నారు? ఈ మధ్య కాలం…. మూడు నెలలు ఎక్కడున్నారు ?ఏం చేస్తున్నారు?
  సబ్జెక్ట్ బాగుంది. మీ వీడియో, ఆడియో బాగున్నాయి. టంగుటూరి సూర్యకుమారి గారి పరిచయం … అదే ….ప్రక్రియ బాగుంది.అప్పుడప్పుడూ పలకరిస్తుండండి . మాకు ఆక్సిజెన్ అందినట్లుంటుంది. …హృదయ పూర్వక దీపావళి శుభాకాంక్షలు …….శ్రేయోభిలాషి ..nootakki

  • రాఘవేంద్ర రావు గారు

   నమస్సులు. ఎలా ఉన్నారు. ఏమి చేస్తున్నారు. చాలా రోజుల తర్వాత మీ దర్శనం కలిగింది. మీ స్పందనకు ధన్యవాదాలు. గత రెండు నెలలుగా టపాలేమి వ్రాయలేదండీ. ఎందుకో సమయం అలా గడిచిపోయింది. కాని బ్లాగ్స్ చూస్తూనే ఉన్నాను.

 3. సూర్య కుమారి గారి గురించి తెలుసుకోవడం బావుంది.
  మళ్ళీ ఆమె స్వరాన్ని వినడం ఈ సందర్భంలో సమయోచితంగా ఉంది.

  • జాజిమల్లి గారు
   నమస్సులు. మీ స్పందనకు ధన్యవాదాలు. నాకు సూర్యకుమారి గారు పాడిన ఈ పాటంటే ఇష్టం, ఆవిడ స్వరం కూడా బాగుంటుంది.

 4. good to see all the videos .


స్పందించండి

Fill in your details below or click an icon to log in:

వర్డ్‌ప్రెస్.కామ్ లోగో

You are commenting using your WordPress.com account. నిష్క్రమించు /  మార్చు )

గూగుల్ చిత్రం

You are commenting using your Google account. నిష్క్రమించు /  మార్చు )

ట్విటర్ చిత్రం

You are commenting using your Twitter account. నిష్క్రమించు /  మార్చు )

ఫేస్‌బుక్ చిత్రం

You are commenting using your Facebook account. నిష్క్రమించు /  మార్చు )

Connecting to %s

వర్గాలు

%d bloggers like this: