వ్రాసినది: శ్రీవాసుకి | ఆగస్ట్ 9, 2010

బ్రహ్మ కల్పం-మహాయుగమంటే ఎంతకాలం

అనంతమైన ఈకాలమానంలో ఎన్నో మహాయుగాలు గడిచిపోయాయి. ఎందరో బ్రహ్మలు గతించారు. బ్రహ్మకు పద్మసంభవుడని పేరు. బ్రహ్మకు ఇప్పటికి కాలమానంలో 50 సంవత్సరాలు గడిచి 51 సంవత్సరంలో శ్వేత వరాహకల్పంలో ఆరు మన్వంతరాలు తర్వాత ఏడవ మన్వంతరమైన వైవస్వతంలో 27 మహాయుగాలు గతించాయి. 28వ మహాయుగంలో 4వది అయిన కలియుగం ఇప్పుడు నడుస్తున్నది.

సహస్ర చతురుయుగ సమానమైన బ్రహ్మ దివసాన్ని 14 మన్వంతరాలుగా విభజించడం జరిగింది. మనమిప్పుడు సప్తమ మనువు వైవస్వతుని కాలంలో ఉన్నాము. పూర్వం ఆరుగురు మనువులు, ఒక్కొక్కరు 76  1/2 చతురుయుగాల చొప్పున 459 చతురుయుగాల కాలం అంటే దాదాపు 3కోట్ల 30లక్షల 50వేల సంవత్సరాలు పాలించారు.

కృతయుగం——-17,28,000

త్రేతాయుగం—– 12,96,000

ద్వాపరయుగం— 8,64,000

కలియుగం——- 4,32,000

_____________________

                      43,20,000      సంవత్సరాలు ఒక మహాయుగం.

_____________________

మన లెక్కల ప్రకారం 360 సంవత్సరాలు దేవతలకు ఒక సంవత్సరం. అటువంటి 12వేల దేవసంవత్సరాలు అనగా 43,20,000 సంవత్సరాలు ఒక చతుర్యుగం (మహాయుగం) అన్నమాట.

2వేల చతుర్యుగాలు బ్రహ్మకు ఒక అహోరాత్రం. 360 అహోరాత్రాలు ఒక సంవత్సరం క్రింద లెక్క. అనగా మనుష్యమానంలో 31,10,40,00,00,000 (311 లక్షల 4వేల కోట్లు) సంవత్సరాలు.

ఈ చతురుయుగానికి మహాయుగమని పేరు. దీని ప్రమాణం 43లక్షల 20వేల సంవత్సరాలు. 71 మహాయుగాలు కలిపి ఒక మన్వంతరం అవుతుంది. ఇటువంటి 14 మన్వంతరాలు బ్రహ్మ దేవునికి ఒక పగలు, మళ్ళీ 14 మన్వంతరాలు ఒక రాత్రి. 28 మన్వంతరాల బ్రహ్మ దినాన్ని కల్పం అంటారు. 360 కల్పాలు బ్రహ్మకు ఒక సంవత్సరం అవుతుంది. అలాంటి నూరు సంవత్సరాలు బ్రహ్మ ఆయుష కాలం. 2000 మహాయుగాలు బ్రహ్మకు ఒక సంపూర్ణ దివారాత్రం. 7లక్షల 20వేల మహాయుగాలు ఒక బ్రహ్మ సంవత్సరం.

ప్రస్తుతం 28వ మహాయుగంలోని 4వ యుగమైన కలియుగంలో ప్రధమపాదంలో 5108 సంవత్సరాలు గడిచాయి.ఇది ప్రస్తుతం మనమున్న కాలం.

 

14మంది మనువుల పేర్లు.

 

1. స్వాయంభువుడు                 2. స్వారోచిషుడు     3. జౌత్తమి               4. తామసుడు  

5. రైవతుడి            6. చాక్షుసుడు           7. వైవస్వతుడు (ప్రస్తుత మనువు)

8. సాపర్ణి              9. దక్ష సాపర్ణి            10. బ్రహ్మ సాపర్ణి             11. ధర్మ సాపర్ణి

12. రుద్ర సాపర్ణి       13. దేవ సాపర్ణి       14. ఇంద్ర సాపర్ణి


Responses

 1. Dear sreevasuki , V.nice post. I really apriciate you to collect this much information. ..Where from you will collect all this information?
  Hope everything is fine with you.
  Happy independence day .
  Congratulations … on this great event …. capturing Title”Indian Idol ” by our Telugu boy Sree Ram… ..with wishes nutakki.

  • రాఘవేంద్ర రావు గారు

   నమస్కారములు. ముందుగా మీ వ్యాఖ్యకి ధన్యవాదాలు. చిరకాల దర్శనం మాకు. ఎలా వున్నారు. నేను క్షేమం. మీరనుకున్న పని ఎలా నడుస్తోంది. బ్లాగ్లోకి వస్తున్నారా లేదా. నేను వ్రాయడం తగ్గించాను. గతంలో నా దగ్గరున్న పాత పుస్తకాలు దుమ్ము దులిపితే వాటిలో నేను వ్రాసుకున్న కొన్ని దైవ సంబంధిత అమూల్య విషయాలు బయటపడ్డాయి. అందులో ఇది కూడా ఒకటి. నలుగురికి తెలియపరచాలన్న ఉద్దేశ్యంతో బ్లాగ్లో వ్రాసాను.

   • శ్రీ వాసుకి గారూ ,ఇటువంటి అమూల్యమైన సమాచారాన్ని భద్రపరిచి మాకు అందిస్తున్నందు అభినందనలు. ఎంతోమంది నాబొంట్లకు తెలియని మహత్తర విషయాలు మీ ద్వారా తెలుసుకో గలిగినందుకు ధన్యుణ్ణి.ఇలాటి విలువైన సమాచారం యింకా వుంటే బ్లాగులో పెట్టేసేయ్యండి.రికార్డెడ్ గా వుండి పోతుంది.
    ఇకపోతే నేను చేపట్టాలనుకున్న కార్యక్రమం కారణాంతరాలవల్ల అర్ధాంతరంగా అటకెక్కింది. ఇతరపనుల వత్తిడిలో బ్లాగులో వ్రాసే అవకాశం ఇప్పటిలో ఉండక పోవచ్చు. మీ వంటి పలువురు మిత్రులు ప్రోత్సహిసున్నారు. కొంత సమయం తరువాత నా వెసులుబాటు చూసుకొని యోచిస్తాను…..వుంటాను …శ్రేయోభిలాషి. ….నూతక్కి.

 2. శ్రీవాసుకి గారికి, నమస్కారములు.

  మంచి వివరాలు చెప్పారు. నేనుకూడా వీటిని మునుపు చదివాను. అయితే, మరికొంత వివరాలు చెప్పగలరా? 27 మహాయుగాలు గడిచినాయి కదా! గడిచిన ప్రతి మహాయుగములోకూడా, త్రేతాయుగములో , ద్వాపర యుగములో, కలియుగములలో ఎవరు వుండేవారు? నా ఉద్దేశ్యం, ప్రస్తుత మహాయుగంలో, త్రేతాయుగములో–శ్రీరాముడు; ద్వాపరములో–కృష్ణుడు; కలియుగములో–కల్కి; వున్నారుకదా. గడిచిన 27 యుగాలలో ఎవరెవరు వుండేవారు? వివరాలు ఏమైనా వున్నాయా, తెలియచేయగలరు.

  భవదీయుడు,
  మాధవరావు.

  • మాధవరావు గారు

   నమస్తే. ముందుగా ధన్యవాదాలు. మంచి ప్రశ్న వేసారు. కాని నాకు సమాధానం తెలియదు. ఎవరైనా పెద్దలని అడిగి దీని గురించి తెలుసుకోవాలి.

 3. manchi samacharam.. vasuki garu.. meeku dhanyavaadalu. naa daggara ee samacharam konta undi.. idi naaku.. na dwara ma channel darshakulaku useful avutundi. madhava rao garu adigina prashnaku konta samacharam naa daggara undi. manam prastutam anukuntunna ramayanam valmeeki itihasam prakaram 26va maha yugam lo jarigindi. ante sumaru 10 lakshala years annamata.. rama setu parishodhanallo daani nirmana kalanni nasa photo lanu vidudala chesinappudu nirdharinchindi kuda..

  • సంతోష్ గారు
   మీ స్పందనకు ధన్యవాదాలు. మీ దగ్గరున్న సమాచారాన్ని మాతో పంచుకోగలరని ఆశిస్తున్నాను.


స్పందించండి

Fill in your details below or click an icon to log in:

వర్డ్‌ప్రెస్.కామ్ లోగో

You are commenting using your WordPress.com account. నిష్క్రమించు /  మార్చు )

గూగుల్ చిత్రం

You are commenting using your Google account. నిష్క్రమించు /  మార్చు )

ట్విటర్ చిత్రం

You are commenting using your Twitter account. నిష్క్రమించు /  మార్చు )

ఫేస్‌బుక్ చిత్రం

You are commenting using your Facebook account. నిష్క్రమించు /  మార్చు )

Connecting to %s

వర్గాలు

%d bloggers like this: