వ్రాసినది: శ్రీవాసుకి | మార్చి 21, 2010

శ్రీ శృంగార వల్లభ స్వామి…!

                                    శ్రీ శృంగార వల్లభ స్వామి
తూర్పుగోదావరి జిల్లా పెద్దాపురం మండలంలో ఉన్న ఒకానొక గ్రామం తిరుపతి. దీనిని చదలవాడ తిరుపతి, తొలి తిరుపతి అని అంటారు. ఇక్కడ స్వామి వారి పేరు శ్రీ శృంగార వల్లభస్వామి. సామర్లకోట రైల్వే స్టేషన్ నుంచి 12 కి.మీ, రాజమండ్రికి 45 కి.మీ దూరంలో ఉంది. ఈ ఆలయ స్తంభాలపై ఉన్న శిలా శాసనములను బట్టి 9 వేల సంవత్సరముల చరిత్ర గలదిగా తెలుస్తోంది. ఈ స్వామి ప్రత్యేకత ఏమంటే “ఎవరు ఎంత ఎత్తు ఉంటే వారికి అంతే ఎత్తు కనబడతాడు”.
పూర్వకాలంలో ఈ ప్రాంతమంతా కీకారణ్యము. ధృవుని తల్లి సునీత. ధృవుని సవతి తల్లి ధృవుడు సిం హాసనం ఎక్కకుండా తంత్రాలు నడుపుతుంది. సునీత, ధృవుని పిలిచి నీవు సిం హాసనం అధిష్టించి, రాజ్యపాలన చేయాలి. అందుకు శ్రీ మహా విష్ణువు దర్శన భాగ్యం కలగాలి. ఆయన దయతో నీకు రాజ్యపాలన యోగం కలుగుతుంది. అందుచేత తపమాచరించి, విష్ణు దర్శనం పొంది, రాజ్యాధికారం సంపాదించమని చెప్పి అడవులకు పంపుతుంది.
అలా బయలుదేరిన ధృవుడు, ఈ కీకారణ్య ప్రదేశమునకు చేరుకున్నడు. ఇచ్చట శాండిల్య మహాముని ఆశ్రమం ఉన్నది. ఆ మునీశ్వరుని దర్శనం చేసుకున్న ధృవుని చూచి, అతని మనసులోని కోరిక తెలిసినవాడై, ముని అతన్ని పిలిచి “నాయనా విష్ణుమూర్తి యొక్క దివ్య మంగళ రూపం తలుచుకొంటూ తపస్సు చెయ్యి. స్వామి ప్రత్యక్షమై నీ కోరిక తీరుస్తాడు అని చెప్పినారు. మునీశ్వరులు చెప్పినట్లుగా తపమాచరించుట మొదలుపెట్టినాడు. అలా కొంతకాలం గడిచిన తర్వాత, ధృవుని తపస్సుకి మెచ్చినవాడై విష్ణుమూర్తి దర్శనమిచ్చాడు. దివ్యకాంతులతో ప్రకాశిస్తున్న విష్ణుమూర్తిని చూచి ధృవుడు భయపడ్డాడు. అంతట విష్ణువు “బాలక భయమెందుకు తత్తరపాటు చెందకు నేను నీ అంతే కదా ఉన్నాను” అని నవ్వుతూ పలుకటయే కాకుండా చెక్కిళ్ళు ఒత్తి భయము లేకుండా చేసినాడు. స్వామి అక్కడే శిలారూపంలో వెలసినాడు. ఇది స్థలపురాణము.
ఆ దివ్యమంగళ సుందరమూర్తియే శ్రీ శృంగార వల్లభస్వామిగా పేరుగాంచాడు. “నీ అంతే ఉన్నాను కదా” అన్ని చెప్పిన కారణంగా చూసే భక్తులు ఎంత ఎత్తు ఉంటే అంతే ఉన్నట్లుగా దర్శనమిస్తాడు స్వామి. చెక్కిళ్ళు ఒత్తిన కారణంగా కుడి ఎడమలకు ఉండవలసిన శంఖు చక్రములు ఎడమ, కుడిలకు ఉంటాయి. స్వామి వారు వెలిసిన కొంతకాలానికి దేవతలు వచ్చి స్వామి వారికి ఆలయనిర్మాణం చేసినారు. తరువాత లక్ష్మీదేవి, నారదుడు. ఈ యుగమున శ్రీ కృష్ణదేవరాయలు వారు భూదేవి అమ్మవారి తామ్ర విగ్రహాన్ని ప్రతిష్టించినట్లు శిలాశాసనములు ద్వారా తెలియచున్నది. భోజమహారాజు, భట్టివిక్రమార్కులు, రుద్రమదేవి, పెద్దాపురం సంస్థాన మహారాణులు ఈ స్వామిని దర్శించుకొన్నవారిలో కొందరు. విక్టోరియా మహారాణి స్వామిని దర్శించి వెండి కవచము చేయించినట్లు చెబుతారు. పిఠాపురం రాజులు స్వామి వారికి 600 ఎకరాల భూమిని దానం ఇచ్చారు. కాని ప్రస్తుతం 21 ఎకరాలు మిగిలింది. నిత్య దీపధూప నైవేద్యాలు జరుగుతున్నాయి. ప్రతి సంవత్సరం చైత్ర శుద్ధ ఏకాదశి రోజున స్వామివారి కళ్యాణం దివ్యంగా జరుగుతుంది. అయితే ఈ ఆలయమునకు అంతగా ప్రచారం లేకపోవడం వలన కేవలం చుట్టుప్రక్కల గ్రామాల ప్రజలే ఎక్కువగా దర్శించుకొంటారు.

స్పందనలు

  1. చక్కగా ఉంది. మీ అనుమతితో ఇందులో సమాచారాన్ని కొన్ని మార్పు చేర్పులతో వికీపీడియాలో వాడుకోవచ్చా?

    • @రవిచంద్ర గారు

      స్పందనకు ధన్యవాదాలు. మీరు ఈ టపాని వికీపిడియాలో పెట్టుకోవచ్చు. నాకేమి అభ్యంతరం లేదు. స్వామి వారి కోసం మనకు చేతనైనంతలో ప్రచారం చేయడంలో తప్పు లేదుకదా.

  2. good post.

  3. మంచి విషయం చెప్పారు.. తప్పకుండా వెళ్ళి దర్శించుకోవాలి. ఎంత ఎత్తు వున్న వాళ్ళకి అంత ఎత్తుగానే స్వామి కనపడడం నేను ఎప్పుడు ఎక్కడా వినలేదు. కృతజ్ఞతలు

    • @ జగదీష్ గారు

      మీ స్పందనకు ధన్యవాదాలు. తప్పక మీ వీలునిబట్టి స్వామిని దర్శించుకోండి.

  4. తెలియని విషయం తెలియపరిచినందుకు ధన్యవాదాలు.. ఒకసారైన..స్వామి గారిని దర్శనం చేసుకోవాలి

  5. ఎంతో అరుదైనా ఈ పురాతన దేవాలయం నేనూ దర్శించాను.
    అతి అరుదైన వల్లభారాయ స్వామి దేవాలయాలు దేశంలో కొన్నే
    వున్నాయి. అందులో ఇది ఒకటి.
    భక్తులు ఎంత ఎత్తు ఉంటే అంత ఎత్తులో భగవతుండు కనపడటం
    అనేది దిగువ మంగళగిరిలోని శ్రీ లక్ష్మీనరసింహస్వామివారి
    దేవాలయంలో కూడా ఉంది. ఈ స్వామి కూడా అలాగే దర్శనం
    ఇస్తాడు – అరిసెట్టి సాయి ప్రసాద్, గుంటూరు.
    ఫోన్: 90 105 22449 .

    • సాయిప్రసాద్ గారు

      మీ స్పందనకు ధన్యవాదాలు. మీరు ఈ ఆలయాన్ని చూశారన్నమాట. బాగుంది. దిగువ మంగళగిరిలోని శ్రీ లక్ష్మీనరసింహస్వామి వారు కూడా ఇలా కనబడతారని నాకు తెలియదు. మంచి విషయం చెప్పారు.

  6. శ్రీవాసుకి గారు,
    కృతజ్ఞతలు. నిజానికి వల్లభారాయ స్వామి దేవాలయాల మీద ఒక పుస్తకం ఈ సరికే రావాల్సింది. ఇవి కొంచెంగా ఉండటం, అవీ అందరికీ తెలియక పోవటం వల్ల ఈ జాప్యం అనుకుంటా.

    నిజానికి ఆంధ్ర దేశంలో వున్న ఈ వల్లభ స్వామి దేవాలయాలన్నింటికీ (నాకు తెలిసినంతవరకూ నాలుగే అనుకోండి) కృష్ణా జిల్లాలోని శ్రీకాకుళంలోని అంధ్ర మహావిష్ణువే ఆత్మ.
    అరిసెట్టి సాయి ప్రసాద్, గుంటూరు

    • సాయిప్రసాద్ గారు
      నిజమే మీరన్నట్టు పుస్తకరూపంలో వస్తే ఎక్కువమందికి తెలిసే అవకాశం ఉంది. ఋషిపీఠం, భక్తి వంటి ఆధ్యాత్మిక పుస్తకాల ద్వారాగాని లేదా స్వాతిలాంటి వారపత్రికల ద్వారాగాని అయితే ఎక్కువమందిని చేరవచ్చని నా అభిప్రాయం.


స్పందించండి

Fill in your details below or click an icon to log in:

వర్డ్‌ప్రెస్.కామ్ లోగో

You are commenting using your WordPress.com account. నిష్క్రమించు /  మార్చు )

ట్విటర్ చిత్రం

You are commenting using your Twitter account. నిష్క్రమించు /  మార్చు )

ఫేస్‌బుక్ చిత్రం

You are commenting using your Facebook account. నిష్క్రమించు /  మార్చు )

Connecting to %s

వర్గాలు

%d bloggers like this: