వ్రాసినది: శ్రీవాసుకి | మార్చి 20, 2010

“ఆయన” తెచ్చిన తంటా ..!

మన తెలుగు భాషలో ప్రాంతాన్ని బట్టి ఒక్కొక్క యాస మరియు కొన్ని ప్రత్యేక పదాలు. ఒకచోట ఒప్పు అన్న పదం మరోచోట తప్పు కావచ్చు. నేను కూకట్ పల్లి లో ఉన్న రోజుల్లో ఒక చిన్న సంఘటన జరిగింది. మా ప్రక్క రూం లో మెదక్ జిల్లా సిద్ధిపేట నుంచి వచ్చిన అబ్బాయిలు ఉండేవారు. అందులో ఒకతను సి.ఎ. చదువుతూండేవాడు. అతను చదువుతూనే ఛార్టెడ్ ఎక్కౌంట్ దగ్గర పనిచేసేవాడు. అతని ఆఫీస్ లోనే గోదావరి జిల్లా అమ్మాయి పనిచేస్తోంది. ఒకరోజు ఏదో అవసరమొచ్చి ఆ అమ్మాయి ఇతన్ని ఏవండీ అని రెండుసార్లు పిలిచిందట. అలాగే వేరే వాళ్ళతో మరో విషయమై ఆయన్ని అడగండి అందిట. ఆ అమ్మాయి “ఏవండీ, ఆయన” అని సంభోధించడం ఈ అబ్బాయికి నచ్చలేదు. ఆ పిలుపిని తప్పుగా అర్థం చేసుకొని ఆ అమ్మాయి చెంప మీద కొట్టాడు. దానితో పాపం అమ్మాయి ఏడుపు. “ఆయన, ఏవండీ” అని ఇంకెప్పుడు పిలవొద్దని చెప్పి వచ్చేసాడుట. రూం కొచ్చిన తర్వాత నాతో ఈ విషయాలు చెప్పాడు. అతని దృష్టిలో ఆయన, ఏవండీ అనే మాటలను తెలంగాణా ప్రాంతంలో భర్తలను మాత్రమే పిలవడానికి అంటారన్నాడు. అందుకే కొట్టానన్నాడు. అప్పుడు నేనన్నాను గోదావరి జిల్లాలలో భర్తని మాత్రమేగాక, తెలియని వారిని, పెద్దవాళ్ళని ఏవండీ అని, ఆయన అని గౌరవంగా సంభోధించడం కోసం అలా అంటారని చెప్పా. ఆ అమ్మాయి ఆ ఉద్దేశ్యంతోనే గౌరవంగా పిలిచిందన్నా. మనవాడికి అప్పుడు అర్థమయింది. మర్నాడు ఆఫీస్ కెళ్ళాక సారీ చెబుతానన్నాడు దానితో పాటు తెలంగాణలో ఆ పిలుపు అర్థం కూడా చెప్పమన్నా. అపార్థాలు తొలగాలి కదా మరి. ఒకొక్కసారి మాట తెచ్చే తంటా ఇలాగే ఉంటుంది. జాగ్రత్త సుమీ.


స్పందనలు

 1. antha mathranike kottala, asalu vishayam cheppali kaani. too much.

  • @స్వప్నగారు మీ స్పందనకు ధన్యవాదాలు. చెప్పే తీరు, నిదానం లేకపోతే అలాగే ఉంటుంది. అబ్బాయి మంచివాడే కాని తొందరెక్కువ.

 2. అంత మాత్రానికే కొట్టేస్తారాండీ !
  మరింతకీ ఏవని పిలవాలండీ ? అలో….ఎస్ కూస్ మి అనాలాండీ .

  • @లలితగారు మీ స్పందనకు ధన్యవాదాలు. భావ వ్యక్తీకరణ సమస్య. కొట్టకముందే అలా అనొద్దని ఆ అబ్బాయి చెప్పి ఉంటే సరిపోయింది.

 3. too much
  గౌరవం ఇవ్వడం కూడా తప్పేనా
  మీరు అయినా గడ్డి పెట్టాల్సింది మీ ఫ్రెండ్ కి

  • @ నవీన్, మీ స్పందనకు ధన్యవాదాలు. అతనికి చెప్పే రీతిలో చెప్పాను.కాని అప్పటికే జరగాల్సింది జరిగిపోయింది.

 4. మాండలికం సరిగా తెలీక పోవడం మూలంగా వచ్చే తంటాలు చెప్పదలచుకున్నారనుకుంట
  .కానీ చెంప దెబ్బ విషయాన్ని పక్క దోవ పట్టించింది .అయినా అతనెవరండీ!
  !అంత రూడ్ గా ప్రవర్తించారు .ఆ అమ్మాయి ఊరుకుందా?ఆశ్చర్యంగా వుంది.

  • @ జాజిమల్లి గారు మీ స్పందనకు ధన్యవాదాలు.
   నేను వ్రాయలనుకున్నది చెంప దెబ్బ విషయమే. కాకపోతే ప్రారంభంలో మాండలికం అర్థకాకపోతే కలిగే అనర్థం గురించి వ్రాసానంతే. ఆ అమ్మాయి ఊరుకోవడానికి కారణం మర్నాడు ఆ అబ్బాయి క్షమాపనలు అడిగాడు. కాకపోతే దెబ్బ తిన్న రోజు పాపం హర్ట్ అయ్యింది. అతనికి నేను గోదావరి జిల్లా మాటలు కొన్ని చెప్పాను. అతను చెడ్డవాడు కాదు. కాని తొందర పడ్డాడు. పిలుపులోని భావం అతడు తప్పుగా అర్థం చేసుకోవడం చెడ్డయింది.

 5. ఆ మెతుకు జిల్లా వాసికి సినిమాలు టీవీలు గట్రా చూసే అలవాట్లు లేవా గురూగారూ…
  పాపం చాలా ఇబ్బందులు పడుతాడు భవిష్యత్ లో

 6. శ్రీ వాసుకి గారికి, నమస్కారములు.

  వ్యాసం బాగుంది. “వినదగు ఎవ్వరూ చెప్పిన, వినీనంతనే వేగిరబడక….” అన్న పద్యం మీ స్నేహితుడు chinnappudu చదువుకోలేదేమో. మీరు చెప్పిన ఆ రెండు పదాలు, కృష్ణా, గుంటూరు జిల్లాల్లో కూడా వాడుతారు. గోదావరి జిల్లాల్లో, ” ఆండీ, ఏమండీ ” అనే పదాలను, చాలా కాలం క్రితం, జమీందారీ కుటుంబంవారు ఎట్లా వాడేవారో చెబుతాను: ” జమీందారు గారు కచేరీలో కూర్చొని వున్నారు. ఎవరో పెద్దలు కలిసి మాట్లాడటానికి వచ్చారు. ప్రక్కనే కొన్ని చినిగిన కాయితాలు కొన్ని పడివున్నాయి. వెంటనే, జమిందారుగారు, వాటిని చూసి, ఒక ఆవిడను పిలిచి, ” ఈ కాయితాలను తీయించండి ” అని చెప్పారు. ఆవిడ లోపలికి వెళ్ళి, ఒక చీపురును తీసుకొనివచ్చి, కాయితాలను వూడ్చి వెళ్లింది. ఇంతకీ “ఆవిడ” పనిమనిషే. సామాన్యంగా అయితే, పనిమనిషి తో ఈ కాయితాలను వూడు అని చెబుతాము. ” కాయితాలను తీయించండి” అని చెబితే, ఈవిడ వెళ్ళి పనిమనిషిని వెంటబెట్టుకొని తీసుకువస్తుందని అందరూ అనుకుంటారు. “గౌరవ వాచకం” వాడకం గోదావరి జిల్లాలలో అట్లా వుంటుంది.
  భవదీయుడు,
  మాధవరావు.

 7. Inthaki aa amaiy aa abbai ni excuse chesinda leda????


స్పందించండి

Fill in your details below or click an icon to log in:

వర్డ్‌ప్రెస్.కామ్ లోగో

You are commenting using your WordPress.com account. నిష్క్రమించు /  మార్చు )

ఫేస్‌బుక్ చిత్రం

You are commenting using your Facebook account. నిష్క్రమించు /  మార్చు )

Connecting to %s

వర్గాలు

%d bloggers like this: