వ్రాసినది: శ్రీవాసుకి | మార్చి 6, 2010

హైదరాబాద్ నుంచి వస్తే అదో ఇది.

ఉదయాన్నే హైదరాబాద్ నుంచి వచ్చిన హైటెక్ బస్సులోంచి దిగి సొంత ఊరిలో ఆడుగిడితే ఆ ఆనందమే వేరు. బస్సు దిగి నడుచుకొని వస్తుంటే తెలుసున్న ముఖాలు మనల్ని నవ్వుతూ ఏమండీ ఇదేనా రావడం అంటూ పలకరిస్తూంటాయి. అప్పుడు మనకి అది గొప్పగా ఉంటుంది. అమెరికా నుంచి వచ్చినంత ఆనందం. ఇక తర్వాత వంతు ఇంటి చుట్టుప్రక్కల వారిది. పలకరింపులన్నీ అయ్యి ఇంట్లోకి వెడితే ఇంట్లో వాళ్ళ ఆత్మీయ పలకరింపులు. ఇక తర్వాత దంతావధానం చేసి ఒక గ్లాస్ నిండుగా కాఫీ కొట్టి నెమ్మదిగా స్నానం చేసి వచ్చేసరికి పళ్ళెంలో ఇష్టమైన ఫలహారం. అలసిసొలసి అంత దూరం నుండి వచ్చిన పుత్రరత్నం కోసం అమ్మ కష్టపడి వండిన ఫలహారం కడుపునిండా తిని హైదరాబాద్ విశేషాలు చెబుతూంటే ఇంతలో ఒక్కటే ఆవులింతలు. పాపం అబ్బాయి ప్రయాణం చేసి అలిసిపోయాడనుకొని కాసేపు బొబ్బోమంటారు. దానికేం మహాభాగ్యమని మంచం మీదకు ఒక దూకు దూకేసరికి నేనున్నానంటూ ఇట్టే వచ్చి కౌగిలించేసుకొంటుంది నిద్రాదేవి. మళ్ళీ భోజనం వేళకి నిద్ర లేపుతారు. కంచం ముందు కూర్చుని ఒక పట్టుపట్టిగాని లేవం. హైదరాబాద్ లో స్వయంపాకం దెబ్బకి చచ్చుబడి ఉన్న నాలుకకి ఇంటి వంట రుచి తగిలేసరికి “ఆహాహా మా ఊరి వంట…ఓహోహో..మా అమ్మ చేతి కమ్మని వంట” అంటూ అలవోకగా పాట వచ్చేస్తుంది. వాళ్ళు కూడా కొసరి కొసరి అన్నీ వడ్డించేస్తుంటారు. ఆ తతంగం పూర్తయ్యాక మళ్ళీ కాసేపు ఇష్టాగోష్టి నడుస్తుంది. ఇంతలో మళ్ళీ టీ విరామ సమయం. ఆ పని పూర్తవ్వగానే ఇక మిగిలినది ఊరు మీద పడటం. మిత్రులు, హితులు, బంధువులను కలవాలిగదా. నా బుజ్జి సైకిల్ని (అప్పట్లో అదే నా హయబుసా మరి, ఇప్పుడు బైక్ ఉందనుకోండి) దుమ్ము దులిపి శుభ్రంగా పెళ్ళికూతురులా తయారుచేసి దానిమీద బయలుదేరి ఒక్కొక్కర్ని కలవడం. ముందుగా మిత్రబృందాన్ని కలిసి మనం దిగిన సమాచారమందిచ్చి అటుగా చుట్టం చూపుకి బంధువుల ఇంటికి వెళ్ళడం. తిరిగి యధావిధి పలకరింపులు, కాఫీ, టిఫినీలతో మర్యాదలు ఎంతైనా హైదరాబాద్లో ఉద్యోగం కదా. అంతలోనే ఒక ప్రశ్న మళ్ళీ ఎప్పుడు వెళ్ళడమని..అంతే ఒకసారి గుండెల్లో కలుక్కుమంటుంది, ఏదో తీరని బెంగ ఆ మాటకి. ఈవేళేగా వచ్చాము, అప్పుడే వెళ్ళడం గురించా అనిపిస్తుంది. సరే ప్రశ్నకు సమాధానం తప్పదు కదా చెబుతాం. ఆరోజు తిరుగళ్ళన్నీ అవ్వగొట్టుకొని ఇంటికొచ్చి ఏదో తిన్నాననిపించి పడకేసేయడం. ఇక మర్నాడు నుంచి మిత్రులతో కలిసి సినిమాలు, పొద్దు తెలియని ఊసులు. ఆ మూడు రోజులు అలా గడిచిపోతుంది. వెళ్ళాల్సినరోజు రానే వస్తుంది. వీడ్కోలు చెప్పటం కోసం అమ్మ, నాన్న, మాకంటే ముందే మిత్రపరివారం బస్సు దగ్గరకు వచ్చి ఉంటారు. ఒకరిద్దరు ఇంటి నుంచి తోడు వస్తారు. బస్సు ఎక్కుతుంటే అమ్మ కళ్ళలో నీళ్ళు, నాన్నగారిలో కావాలని తెచ్చిపెట్టుకున్న గాంభీర్యం. మిత్రులలో తిరిగి మళ్ళీ దూరమవుతున్న అనుభూతి. నేనెప్పుడు మా ఊరు నుండి హైదరాబాద్ వెళ్ళిన నాకు ఎదురయ్యే అనుభూతి ఇది. బస్సు కదిలి ముందుకు వెడుతుంటే తలకాయని, ఓ చేతిని బయటకు పెడితే అందరు చేతిని ఆత్మీయంగా పట్టుకోవడం అలా వెడుతూ వెనక్కి వాళ్ళనే చూస్తుంటే ఏదో తెలియని బెంగ. బస్సు ఊరుని దాటి వేగంగా చీకటిని చీల్చుకొంటూ హైదరాబాద్ వైపుగా పరుగెడుతుంటే అంతరంగంలో ఇంటి ఊసులన్ని ఒక్కొక్కటిగా గుర్తుకొస్తుంటాయి. అప్పుడనిపిస్తుంది మనసుకి హైదరాబాద్ నుంచి వస్తే అదో ఇదని. మరపురాని అనుభూతని. 


Responses

 1. home coming is always great
  similar feeling for everybody

  they cant express but you did
  thats the difference

  బస్సు కదిలి ముందుకు వెడుతుంటే తలకాయని, ఓ చేతిని బయటకు పెడితే అందరు చేతిని ఆత్మీయంగా పట్టుకోవడం అలా వెడుతూ వెనక్కి వాళ్ళనే చూస్తుంటే ఏదో తెలియని బెంగ. బస్సు ఊరుని దాటి వేగంగా చీకటిని చీల్చుకొంటూ హైదరాబాద్ వైపుగా పరుగెడుతుంటే అంతరంగంలో ఇంటి ఊసులన్ని ఒక్కొక్కటిగా గుర్తుకొస్తుంటాయి
  Excellent
  very nicely written

  • కిరణ్ గారు మీ అభిమానానికి ధన్యవాదాలు. మీరన్నట్టు అందరి మనసులలోను కలిగే అనుభూతి ఇది.

 2. chala correct ga chepparandi..naku kuda ante santosham ga anipinchedi hyd nundi intiki vellinappudu. enni sarlu intiki vachi vellina mali velleppudu kallalo neelu tirugutuntayi. adenemo atmeeyata ki gurthu. entaina na pata gnapakalani gurthu chesaru meeru. so malli eppudu veltunnaru intiki 😉

  • అయిన వాళ్ళ ఆత్మీయతకు విలువ కట్టలేము. వారి ప్రేమ, అభిమానం మనకెప్పుడూ రక్ష. మీరు సరదాగా మీ అనుభవాన్ని వ్రాయండి. నా బ్లాగ్ దర్శించినందుకు మీకు ధన్యవాదాలు.

 3. http://dedicatedtocpbrown.wordpress.com/2010/03/03/%E0%B0%AE%E0%B0%A8-%E0%B0%A4%E0%B1%86%E0%B0%B2%E0%B0%82%E0%B0%97%E0%B0%BE%E0%B0%A8%E0%B0%BE%E0%B0%82%E0%B0%A7%E0%B1%8D%E0%B0%B0-%E0%B0%B2%E0%B1%8A%E0%B0%B2%E0%B1%8D%E0%B0%B2%E0%B0%BF-%E0%B0%B9/

 4. మా ఊరెళితే దాదాపు నాది కూడా ఇలాంటి కార్యక్రమమే..హైదరాబాదు, చెన్నై లాంటి చోట్ల ఉండే కోస్తాంధ్రులందరికీ దాదాపు ఇలాంటి అనుభవమే ఉంటుందనుకొంటా…
  “ఏదో తెలియని బెంగ…” ఈ బెంగే మనలని మనుషులు గా మిగిలిన ప్రకృతి నుంచీ వేరు చేసేది…బాగుంది..మీ నుంచీ అచ్చ తెలుగు ఒరవడి లో ఇంకా చాలా ఆశిస్తున్నాను.

  • సొంత ఊర్ల నుంచి హైదరాబాద్, తదితర చోట్లకి వెళ్ళినవారందరికి ఇవే అనుభవాలనుకుంటా. బెంగ అనేది లేకపోతే మనిషి తన వాళ్ళ గురించి ఆలోచించడేమో. నా బ్లాగ్ దర్శించినందుకు ధన్యవాదాలు.
   >>మీ నుంచీ అచ్చ తెలుగు ఒరవడి లో ఇంకా చాలా ఆశిస్తున్నాను

   తప్పక ప్రయత్నిస్తాను. మీ ప్రోత్సాహానికి ధన్యవాదాలు.

 5. ప్చ్ …సేం పించ్ 😦 చదువుతుంటే ఇప్పుడే రిటన్ బస్ ఎక్కుతున్నట్టూ …లేకపోతె గౌతమీ ఎక్కుతున్నట్టూ ఉందండీ …కాకినాడ ఫ్లాట్ ఫాం మీద గౌతమీ ఎక్కేవారికంటే ఎక్కించడానికి వచ్చేవారు ఎక్కువ 🙂

  • నా టపా చదివి రైలెక్కేసారా ఏమి. ఇవి ప్రతీసారి కలిగే మరపురాని తీపిగుర్తులు. కాదంటారా. బ్లాగ్ దర్శించినందుకు ధన్యవాదాలు.

 6. చాలా బాగా రాసారండీ!!

 7. నిజ్జంగా అలాగే జరుగుతుంది. అదీ కొంతకాలమ్. తరువాత మెల్లగా పరిచితులు అపరిచితులుగా మారుతుంటారు. మరికొందరు పరిచితులు పైకి పరిరచితులుగా వెళ్ళిపోతారు. మెల్ల మెల్లగా బందువులు కూడా పెద్దవాళ్ళు మాత్రమే మనలను గుర్తు పడుతారు. అలా కొద్దికాలానికి వాళ్ళ ఇళ్లకు, మన అనే ఊరుకు వెళితే మనకే అయోమయం అయిపోతుంది.

  అప్పుడు మనం అనుకొనేది ఊరు మారిపోయింది, మనుసులూ మారిపోయారు.

  • @విశ్వనాధ్ గారు

   మీ స్పందనకు ధన్యవాదాలు.
   >>తరువాత మెల్లగా పరిచితులు అపరిచితులుగా మారుతుంటారు. ఈ మాట నిజం. సొంతూరికి మనం కొత్త వాళ్ళం అవుతాము. ఊరు మారుతుంది. తరం మారుతుంది.

 8. శ్రీవాసుకి గారికి, నమస్కారములు.

  వ్యాసం చాలా చక్కగా వున్నది. బస్సులో మన ఊరికి ప్రయాణం, నిజ జీవితంలో మన జీవన ప్రయాణానికి పోలిక వున్నది. నిన్న,మొన్నటివాటిని నెమరువేసుకుంటూ, వర్తమానంలో పయనిస్తూ, రేపటిమీద ఆశతో భవిష్యత్ లోకి పయనిస్తూ వుంటుంటాం.

  భవదీయుడు,
  మాధవరావు.

  • మాధవరావుగార్కి,

   నమస్కారములు. మీ స్పందనకు ధన్యవాదాలు. బస్సు ప్రయాణంలాగే జీవిత ప్రయాణంలో కూడా మనకు దూరమయ్యే ఆత్మీయులు, మనతోపాటే ప్రయాణించే అపరిచిత మిత్రులు, అలాగే ఆఖరి ప్రయాణానికి వీడ్కోలు పలికే బంధు, మిత్ర పరివారము. మరో తెలియని దూర తీరానికి ప్రయాణం.అంతులేని అనంత లోక ప్రయాణం.


స్పందించండి

Fill in your details below or click an icon to log in:

వర్డ్‌ప్రెస్.కామ్ లోగో

You are commenting using your WordPress.com account. నిష్క్రమించు /  మార్చు )

గూగుల్ చిత్రం

You are commenting using your Google account. నిష్క్రమించు /  మార్చు )

ట్విటర్ చిత్రం

You are commenting using your Twitter account. నిష్క్రమించు /  మార్చు )

ఫేస్‌బుక్ చిత్రం

You are commenting using your Facebook account. నిష్క్రమించు /  మార్చు )

Connecting to %s

వర్గాలు

%d bloggers like this: