వ్రాసినది: శ్రీవాసుకి | ఫిబ్రవరి 28, 2010

వాఘా సరిహద్దు — జై భారత్

వాఘా సరిహద్దు వద్ద ప్రతిరోజు జరిగే భారత్, పాక్ ల సైనిక కావాతు. నిత్యం వేయి కనులతో కాపలా కాచే మన సైనిక సోదరుల చూడచక్కని కవాతు. అది చూడటానికి ప్రజలను అనుమతిస్తారు.  జై భారత్


Responses

 1. చూశారా భారత్-పాక్ సైనికులు చివరలో చేతులు కలిపగానే ప్రజలు ఎంతగా స్పందించారో. ఎప్పటికి రెండు దేశాల మధ్య స్నేహపూరిత వాతావరణం వచ్చి, ఈ వాఘా కార్యక్రమానికి ప్రాముఖ్యత తగ్గిపోతుందోకదా.

  • రాజకీయంగా ఈరెండు దేశాలు కలవడం జరగనిపని. మనం చిత్తశుద్ది చూపించినా పాకిస్తాన్ ముందుకు రాదు. భారత్ బూచిని చూపిస్తే కాని అక్కడి వాళ్ళకు రోజులు గడవవు మరి. ప్రజల మనసెప్పుడు ఒక్కటే కలిసి ఉంటే కలదు సుఖమని. మీ వ్యాఖ్యకు ధన్యవాదాలు.

 2. “భారతీయులంతా హిందువులే. హిందువులు కానివారు భారతీయులే కాదు.హిందువు అన్న పదానికి అర్థం మతం కాదు, అది జీవన విధానం.చాణక్యుడు చెప్పిన విషయాలు ఆ కాలానికి మాత్రమే చెల్లుబాటు అవుతాయి గానీ ఆధునిక భారతానికి కాదు.–ఆరెస్సెస్‌ చీఫ్‌ మోహన్‌ భాగవత్‌ (సాక్షి 1.3.2010)
  ఈ విస్తృత నిర్వచనం ప్రకారం మనఅఖండ భారతదేశంలో జన్మించిన క్రైస్తవ,ముస్లిం భారతీయ సోదరులంతా జన్మతా హిందువులే కదా?భారతీయ ముస్లిములు,క్రైస్తవులు- హిందువులు కాకుండా ఎలా ఉంటారు?

  • మీరన్న హిందువు అన్నపదం వేదాలలో ఎక్కడా లేదు. మొదటినుండి ఇది సనాతన ధర్మంగానే పిలువబడుతోంది. సనాతనం అంటే ప్రాచీనమైనది మరియు అన్నికాలాలలోను ఆచరించదగ్గది అని అర్థం. బ్రిటిష్ పాలనలో మనమంతా హిందువులుగా (సింధు అన్న నది పేరు ఆధారంగా) పిలువబడ్డాము. కాలక్రమేణా అది ఒకమతానికి సంబంధించిన పర్యాయ పదంగా మారిపోయింది. అయితే బ్రిటిష్ వారి వలన క్రైస్తవం, మొఘలుల వలన ఇస్లాం ఈదేశంలోకి ప్రవేశించాయి. అంతవరకు సనాతన ధర్మ ఆచరణులుగా ఉన్న కొంతమంది పై మతాలలోకి స్వఛ్చందంగాను, బలవంతంగాను మార్చబడ్డారు. క్రమేణా వారు ఆయా మత విధానాలు అవలంభించడం చేసారు. దాని వలన కాలక్రమంలో సనాతధర్మ ఆచరికుల (హిందువులు) మధ్య, వీరి మధ్య ఒక తెలియని అఖాతం ఏర్పడింది. అంతకుముందు ఆసేతుహిమాచలం నుండి ఒక్కటిగా ఉన్న జాతి నేడు బహు రూపాలుగా విడిపోయింది. అయితే మనందర్ని ప్రస్తుతం ఒక్కటిగా కలిపి ఉంచుతున్నది భారతీయత. ఇది ఒక మహా మంత్రం. కులమతాలకు అతీతంగా అందరు జపించే మంత్రం.

 3. హిందువు అన్నపదం వేదాలలో ఉందో లేదో నాకు తెలియదు.భారతీయులంతా హిందువులే అని భాగవత్ గారుఅన్నారు కాబట్టి ముస్లిములు కూడా హిందువులేనా అని అడిగాను. మీరు మళ్ళీ హిందూ అనేది లేదు అది సనాతనం,అఖాతం ఏర్పడింది అంటే కన్ ఫ్యూజన్ వస్తోంది.ప్రస్తుతం మన అందరినీ సోదరుల్లా కలిపి ఉంచే శక్తి భారతీయతకే ఉన్నట్లుంది.కానీ భాగవత్ గారు హిందువులు కానివారు భారతీయులే కాదు అంటున్నారుగా.ఆమాటను ఎలా అర్ధం చేసుకోవాలి?

  • నేను చెప్పిన విషయంలో అర్థం కానిదేది లేదు. కాకపోతే మీకు ఈ విషయం పట్ల అవగాహన లేకపోయి ఉండొచ్చు. నేను ఇంతకుముందు చెప్పినట్లు ఇతర మతాలేవి ఈదేశంలోకి రాకమునుపు అంతా హిందువులమే.అందులో ఎలాంటి సందేహం లేదు. ఆ కాలంలో భారతీయులు కొంతమంది ఇతర మతాలలోకి స్వచ్ఛందంగా/బలవంతంగా గాని మార్చబడ్డారు.

   >>భారతీయులంతా హిందువులే అని భాగవత్ గారుఅన్నారు కాబట్టి ముస్లిములు కూడా హిందువులేనా

   వివరణ చూసారు కదా దానిబట్టి మిమ్మల్ని మీరు ఏమనుకొంటున్నారో హిందువనా, ముస్లిమనా చెప్పండి.

   మీ ప్రతిస్పందనకు ధన్యవాదాలు.

 4. మీతోపాటు నేనూ భారతీయుడినే.ఇక్కడ జాతీయత ముఖ్యమా మతం ముఖ్యమా అనేది మీరే చెప్పాలి.హిందువు అన్న పదానికి అర్థం మతం కాదు, అది జీవన విధానం అనుకుంటే నేనూ హిందువునే.ఇక హిందువులు కానివారు భారతీయులే కాదు అనేందుకు ఆస్కారమే లేదు.ఎందుకంటే భారతీయులంతా హిందువులే కదా.

  • హిందూ అనేది ఒకప్పుడు ఇది జాతీయత, జీవన విధానం. మతం అన్నమాటే లేదు. కాని ఇప్పుడు భారతీయులను విడగొట్టుటకు పాశ్చాత్య దృక్కోణం నుండి మతమై కూర్చుంది. మేము హిందువులం అంటే అందరూ అదో మతంగానే చూస్తారు తప్ప జాతిగా చూడరు. జాతిగా చూసినరోజు ఈ దేశానికి అసలు మతమన్నదే లేదు.

   >>హిందువు అన్న పదానికి అర్థం మతం కాదు, అది జీవన విధానం అనుకుంటే నేనూ హిందువునే

   మీరలా భావించిన రోజు, జాతీయత ముఖ్యమనుకున్నప్పుడు మతమన్న ప్రస్తావనే ఉండదు.

 5. మతం మానవ మేధన
  మనుగడ సాగించే
  అభిమతం వ్యక్తిగతం
  మానవ జీవన వేదమై
  నియంత్రితమైన
  మానవజీవన సరళి
  సరళమైతే సమ్మోహనం
  కఠినమైతే మానవాళికది
  విక్రుత వేదనం.

  శ్రీ వాసుకీజీ, రహమతుల్లాజీ, యిది అనంతమైన చర్చ.మతం మనుషులకే పరిమితమా యితర జీవులకు కూడా వర్తిస్తుందా. నా అభిమతంలో మతం అన్నది … వ్యక్తిగత అభిప్రాయం. సామూహిక అభిమతాలుగా మార్చబడి మానవ జాతిని వర్గాలుగా చీల్చి……హిందువుల్లో ఎన్నెన్నో వర్గ విభేదాలు శైవులూ వైష్ణవులూ,తద్వివాద ఝరిలో విస్మరించ బడి ఆదరణ కోరి ,బౌద్ధులై కొందరు, క్రిష్టియనులై ఆయా వర్గ వివాదాలలో తలమునకలౌతూ మరికొందరు, .ముస్లిములవుతూ తిరిగి షియా సున్నీ భావవైవిధ్యాలఝరిలొ కొట్టుకుపోతూ మనసు ప్రశాంతంగా వుంచుకోవాలనే భావనతో తన మనసుకు నచ్చిన రీతిలో అద్రుశ్య శక్తిపై ధ్యాస కేంద్రీకరించే ప్రక్రియ నా విధానం గొప్పదంటె నాదేననే రితిలో వాదనలు వైషమ్యాలై న ఆధిపత్యపు పోరు.అదో రాజకీయ వ్యసనం.
  యీ విశాల విశ్వంలో మనిషి వునికి మరెక్కడైనా వుందా అని వెతుకుతుంటే మనిషికే వునికిగా మారిన భూమిపై వుండి మానవులుగా మసలుతున్న మనం మానసిక ఆధిపత్యాలకొరకు ….యిదే భూమిపైన మనుగడ సాగించే జీవులకు కూడా మతాన్ని ఆపాదిద్దామా?
  నా అభిమతంలొ యీ భారత భువి పై హిందూ మతంగా పిలవబడుతున్న మతం గాని, వారి ఆరాధ్య దైవాలు గాని, మధ్య ప్రాచ్య ప్రాంతాలనుంది భారత భువిపై వలసవచ్చి స్థానికులను ద్రవిడులనే పేరుతో వారిని దక్షిణ భారతానికి తరిమేసి, ఆతరువాత వారినే రాక్షసులుగా చిత్రించి ఆతరువాత ఆప్రాంతాన్నీ ఆక్రమించుకొని, భారత భువినుంచి వారిని తరిమేసిన ఆర్యులనే వారు స్రుష్టించిన మతం హిందూ మతం. మనమంతా ఆ చెట్టు కొమ్మలమే. తొలుతనుండీ యీ భారత గడ్డ మిగతా ప్రపంచానికి స్వాగత ద్వారాలు తెరిచి వుంచింది. గొప్పతనం భారత భువిది వ్యక్తులది కాదు.
  బలం వున్న వాళ్ళు నిలబడుతూ వచ్చారు బలహీనులు తరమ బడ్డారు. అనేక సంస్క్రుతుల సమ్మేళనంతో నిరంతరం నూత్న రూపు సంతరించుకొంతూ వస్తోంది, తే. బలీయమౌతూ వస్తోంది భారతీయ సంస్క్రుతి. .. నా మతం మీకు వితండంగా వుండొచ్చు. అయినా అది నా మతం. చర్చకు నన్నూ స్వాగతించినందుకు అభినందిస్తూ .మీ అందరి రాఘవేంద్ర.

  • రాఘవేందర రావు గార్కి, ముందుగా నా అభ్యర్ధన మన్నించినందుకు ధన్యవాదాలు. మీ యొక్క సుదీర్ఘ వివరణతో రహంతుల్లా గారి సందేహం తీరినట్లే భావిస్తున్నాను.

   ఇక మీరన్నట్లు మతం ఇది అనంతమైన చర్చ. తెగేది కాదు. అది నిత్యాగ్ని. దాని జోలికి వెళ్ళకపోవడమే మంచిది.

   ఇకపోతే మీరన్న ఆర్యుల దండయాత్ర వల్ల ద్రవిడులు దక్షిణ పథానికి తరమబడ్డారని. దీని మీద నాకు కొన్ని సందేహాలున్నాయి. ఆర్యులు, అనార్యులు అన్నది కేవలం ఆంగ్ల దొరల విభజన సూత్రంలో ఒక భాగమని అది వారు సృష్టించినటువంటి చరిత్రని. నేడు మనం చదువుతున్న మెకాలె విద్యా విధానంలో భాగం. వేదాల ప్రకారంగాని, పురాణాల ప్రకారంగా గాని చూసినప్పుడు అనాదిగా భారతీయులు ఒక్కటిగా ఉత్తర, దక్షిణాదులలో జీవిస్తూ ఉన్నారు కదా. మన మీద ఆంగ్ల దొరల ప్రభావం పడి మనం కూడా వాళ్ళు చెప్పిన పాఠాలే వల్లె వేస్తున్నామని నా అభిప్రాయం.

 6. we are waiting for your next post

  its a nice blog

 7. డియర్ శ్రీ వాసుకి , మీ భావన మీ సందేహం కాదనను .అన్నీ ఇఫ్ అండ్ బట్సే ,లేకుంటే మేబీ లు……

  భారత దేశం లో హిందూ మతం అన్నది , ఘోరీల దాడులకన్నా, అలెగ్జాండర్ ప్రపంచ ఆధిపత్య పోరాటాలకన్న,మొఘలాయీల సామ్రాజ్యానికన్న,ఆంగ్లేయుల ఆధిపత్యానికన్నా, బహుపురాతనమైనది గా చెప్పబడింది కదా! సరే మీరన్నట్లే అనుకుందాం……యీ క్రింద మీ సందేహం..

  వేదాల ప్రకారంగాని, పురాణాల ప్రకారంగా గాని చూసినప్పుడు అనాదిగా భారతీయులు ఒక్కటిగా ఉత్తర, దక్షిణాదులలో జీవిస్తూ ఉన్నారు కదా. మన మీద ఆంగ్ల దొరల ప్రభావం పడి మనం కూడా వాళ్ళు చెప్పిన పాఠాలే వల్లె వేస్తున్నామని నా అభిప్రాయం.

  యే పరిమిత కాలమాన ప్రాంత హద్దులతో వుత్తర దక్షిణ ప్రాంతాలలో ఒక్కటిగా నివసించే వారు?……అని మన పురాణాలు చెప్పాయి.? వుత్తర భారతంలోని ఒక ప్రాంతపు వుత్తర దక్షిణ ప్రాంతాలా? లేక దక్షిణ భారతం లోని ఒక ప్రాంతపు వుత్తర దక్షిణ ప్రాంతాలా?

  వాటికి ద్రుష్టాంతరాలేమిటి? వాటిలోనూ అనేక విభిన్న కోణాల్లో ఆయా ప్రాంతాలపై ఆయా కాలాలపై విభిన్నఅభిప్రాయాలుండవచ్చుకదా! …

  మీ సందేహానికి సమాధాన రాస్తే అది చాల పెద్దదై కూర్చుంది. దాన్ని మీకు సమాధానంగా అందించడం సమంజసమనిపించలేదు అందుకే సంక్షిప్తంగా……. అభినందనలతో…. శ్రేయోభిలాషి ..నూతక్కి

  • మీ సమాధానాన్ని ఒక టపాగా వ్రాసి పెట్టండి. నా సందేహం తీరవచ్చు. మీ స్పందనకు ధన్యవాదాలు.


స్పందించండి

Fill in your details below or click an icon to log in:

వర్డ్‌ప్రెస్.కామ్ లోగో

You are commenting using your WordPress.com account. నిష్క్రమించు /  మార్చు )

గూగుల్ చిత్రం

You are commenting using your Google account. నిష్క్రమించు /  మార్చు )

ట్విటర్ చిత్రం

You are commenting using your Twitter account. నిష్క్రమించు /  మార్చు )

ఫేస్‌బుక్ చిత్రం

You are commenting using your Facebook account. నిష్క్రమించు /  మార్చు )

Connecting to %s

వర్గాలు

%d bloggers like this: