వ్రాసినది: శ్రీవాసుకి | ఫిబ్రవరి 25, 2010

ఎప్పటిలాగే ఈసారి కూడా…

ఎప్పటిలాగే ఈసారి కూడా కూత వేసుకుంటూ రైలెళ్ళిపోయింది. సొంత రాష్ట్రం తప్ప మరొకటి కనిపించని మమతమ్మగారు కొత్త రైళ్ళు, పెట్టెల తయారీ కర్మాగారాలు తన ప్రాంతానికే కేటాయించేసుకున్నారు. ఏడుస్తామని అనుకుంటా మనకు మాత్రం తూతూ మంత్రంగా పెట్టెలు బాగుచేసుకునే భాగ్యం కలిగించారు. చెప్పుకోదగ్గ ఒక గొప్ప రైలు మనకు లేదు. విశాఖపట్టణం నుండి హైదరాబాద్ కి కొత్త రైలుగాని, ఎన్నాళ్ళగానో ఎదురుచూస్తున్న కాకినాడ-కోటిపల్లి, కోనసీమ-నరసాపురం రైల్వేలైన్ గురించిగాని ఎక్కడ లేదు. అధిక ఆదాయం తెచ్చే దక్షిణ మధ్య రైల్వే అంటే అంత అభిమానం ఆవిడకి. దాణా లాలూ గారి హయాంలో అంతా బీహారుకి, ఇప్పుడు బెంగాల్ కి. రాష్ట్రానికి ముముప్పైముగ్గురు ఎం.పి. లు ఉండి ఏం పీకుతున్నారో అర్థం కాదు. వంగి వంగి వినతి పత్రాలు అందించడమే తప్ప అధికారికంగా అడిగితీసుకోవడం లేదు. నలుగురు మంత్రులున్న తమిళనాడు అన్నీ లాగేసుకొంటోంది. మనకున్న 33 లో ఒకరు కూడా నేరుగా కేంద్ర మంత్రి పదవి చేపట్టలేదు. మేడం గారు విదిల్చే బిస్కట్లకు కక్కుర్తిపడటం తప్ప. స్వప్రయోజనాలు చూసుకొంటారు గాని రాష్ట్ర ప్రయోజనాలు అక్కర్లేదు. కేంద్ర మంత్రులు తాము దేశానికి ప్రాతినిధ్యం వహిస్తున్నామన్న విషయం మరిచి, సమ న్యాయం మరిచి ప్రవర్తిస్తున్నారు.

Responses

  1. అయ్యా,
    తిరుమల పై చెడుగాలుల నియంత్రణకు నావి కొన్ని ప్రతిపాదనలున్నాయి. మీకు నచ్చితే మీరు కూడ వీటిని ప్రచారం చెయ్యండి

    http://blaagu.com/swamy7867/2009/01/21/tirumala-vision-1900-complete/

    • మీ ప్రతిస్పందనకు ధన్యవాదాలు. మీరు పంపిన లింక్ చూసాను. ప్రతిపాదనలు బాగున్నాయి. ముందుగా అక్కడ పనిచేసే చిన్న ఉద్యోగుల నుండి పెద్ద ఉద్యోగులు వరకు పాటించాల్సిన ఆలయ నిబంధనలు, భక్తులతో మెలగవల్సిన పద్దతులు నేర్పించాలి. అవి వారికి తెలియనవి కావు. కాని తరుచూ భోధిస్తూ ఉండాలి. వారి మీద నిఘా ఉండాలి. సిబ్బంది సక్రమంగా ఉంటే వచ్చే భక్తులు కూడా సక్రమంగానే ప్రవర్తిస్తారని నా అభిప్రాయం.


స్పందించండి

Fill in your details below or click an icon to log in:

వర్డ్‌ప్రెస్.కామ్ లోగో

You are commenting using your WordPress.com account. నిష్క్రమించు /  మార్చు )

గూగుల్ చిత్రం

You are commenting using your Google account. నిష్క్రమించు /  మార్చు )

ట్విటర్ చిత్రం

You are commenting using your Twitter account. నిష్క్రమించు /  మార్చు )

ఫేస్‌బుక్ చిత్రం

You are commenting using your Facebook account. నిష్క్రమించు /  మార్చు )

Connecting to %s

వర్గాలు

%d bloggers like this: