వ్రాసినది: శ్రీవాసుకి | ఫిబ్రవరి 18, 2010

” వెయ్యేళ్ళు ధనంతో వర్ధిల్లు “

చిన్నతనంలో ఆటలాడుకొనేటప్పుడు మన గోల భరించలేక పెద్ద వాళ్ళు తిడుతూండేవారు. ఒకొక్కరికి ఒకొక్క ఊతపదం అలవాటుండేది. కొంతమంది శుంఠ అని, బడుద్దాయని రకరకాలుగా అంటుండేవారు. మా బంధువలు ఒకామెకు వెధవ అనడం అలవాటు. మేము ఏమైనా అల్లరి చేసినప్పుడు, సరదా వేళాకోళాలాడేటప్పుడు ఆమె వెధవ అని తిట్టేది. మళ్ళీ మేము ఏమైన నొచ్చుకొంటామేమో అని లౌక్యంగా ఒరేయి పిల్లలు నేను తిట్టడంలేదర్రా దీవిస్తున్నాను అంతే అనేది. వెధవ అనే మాటకు ఆమె చెప్పిన అర్థం “వెయ్యేళ్ళు ధనంతో వర్ధిల్లు” అని. ఒక దెబ్బకి రెండు పిట్టలన్నట్టు తిట్టు, దీవెన. అందుకే ఉచిత సలహా ఏమంటే ఎవరినైనా తిట్టారో, దీవించారో తెలియకూడదనుకొంటే వెధవ అనే అనండి అంతేగాని ఎదవ అనొద్దే.


Responses

 1. 🙂

 2. వెదవ(వత్తు లేకుండా) అంటే వెదురు కఱ్ఱతో దవడ మీద వడ్డించు అని చిన్నప్పుడు మేము తిట్టుకునేవాళ్ళం

 3. he he

 4. Please check http://harephala.wordpress.com/2010/01/19/baataakhaani-126/

  • మీ ప్రతి స్పందనకు ధన్యవాదాలు. నాపై ఓ కన్నేసి ఉంచండి.

   • వెధవది,…. శ్రీ వాసుకి గారు…. వెధవ సంబంధ గోల ఎత్తకుండా వుండి వుంటే… మహామహులు కళా వాచస్పతి శ్రీ స్వర్గీయ కొంగర జగ్గయ్య గారు కొన్ని దశాబ్దాలక్రితమే వెధవ నామ స్మరణాత్మక విషయం చర్చించినట్లు శ్రీ ఫణి బాబుగారి యీ లేఖ ద్వారా బ్లాగ్లోకానికి తెలిసి వుండేది కాదు. ముందు వెధవ విధవ ఎదవ ఆర్టికల్స్ పై శ్రీవాసుకి గారినీ, ఫణి బాబు గారినీ శ్రీ కొంగర జగ్గయ్య గారినీ ప్రశంసించకుండా వుండలేము. అభినందనలు అందరికీ. .. విక్రుతి నామ సంవత్సర వుగాది శుభాకాంక్షలండి,మీకూ మీ కుటుంబసభ్యులందరికీ ….మరికొన్నిఇలాటి నానుడి పదాలపై క్రొత్త చర్చలు లేవనెత్తండి…శ్రేయోభిలాషి ..నూతక్కి

    • బ్లాగ్ సందర్శించినందుకు మీకు ధన్యవాదాలు. అయితే మీ బ్లాగ్ పుణ్య సందర్శన యాత్ర ప్రారంభించారన్నమాట. మీ వ్యాఖ్యలతో మమ్మల్ని పావనం చేస్తున్నారన్నమాట. తప్పక మళ్ళీ మళ్ళీ విచ్చేయండి అమూల్యమైన అభిప్రాయాలతో.

 5. బాగా చెప్పారు. తప్పులెంచు వారు తమ తప్పులెరగరు అని సామెత.అని చెప్పారు
  మీకు ఏమి చెప్పాలన్న మీరు satirlu వేస్తున్నారు అప్పుడికి అప్పుడు 🙂

  స్వాతి వారపత్రికలో అడగండి చెపుతా శీర్షికలో ఉన్న మాలతీచందూరు గారేనా???
  Ans:నన్ను అడగండి కదండీ ఆ శీర్షిక పేరు

  పొరపాటున వీడేంటి మార్తాండలా మాట్లాడుతున్నాడు అని మీకు అనిపిస్తే ఏమి అనుకోకండీ

  • మీ అభిమానానికి ధన్యవాదాలు. అది సటైర్ అనుకున్నారన్నమాట. సరే మీ ఇష్టం. నిజంగానే ఆ శీర్షిక పేరు మరిచిపోయా, గుర్తు చేసినందుకు నెనర్లు. ఓహొ ఐతే తమరు మార్తాండ ఏమి. మీ బ్లాగ్ నామధేయం తెలుపగలరు.

  • @Naveen ,మార్తాండ స్టైల్ ఎవరి నోట వినిపించినా మార్తాండ అని అనుకోకపోతే మార్తాండకు కోపం వస్తుందంట.అందుకనే…. జూ ప్రదర్శన నుంచి ఎప్పుడొచ్చారు మార్తాండ గారు?… … అభినందనలు నవీన్ గారూ….నూతక్కి

 6. 😉 😉

  • @నెల బాలుడు గారూ, శ్రీ వాసుకి గారి కొరకు మీరిచ్చిన ఎప్రెషన్స్ బాగున్నాయండి. ఇంతకీ పోస్టుకా వీక్షకులకా? @ శ్రీవాసుకి హమ్మయ్య ఇంకెక్కడికీ వెళ్ళనక్కరలేదు అందరినీ శ్రీ వాసుకి బ్లాగులోనే కలిసెయ్యొచ్చు
   ధన్యుడనయ్యా
   వేయిపడగలా
   శ్రీవాసుకి నామా …నూతక్కి.

   • మీ చక్కెర వంటి కవితా పలుకులతో ఈ చేతగాని వాడ్ని మునగచెట్టు ఎక్కించేస్తున్నారు కవి రాజమా.


స్పందించండి

Fill in your details below or click an icon to log in:

వర్డ్‌ప్రెస్.కామ్ లోగో

You are commenting using your WordPress.com account. నిష్క్రమించు /  మార్చు )

గూగుల్ చిత్రం

You are commenting using your Google account. నిష్క్రమించు /  మార్చు )

ట్విటర్ చిత్రం

You are commenting using your Twitter account. నిష్క్రమించు /  మార్చు )

ఫేస్‌బుక్ చిత్రం

You are commenting using your Facebook account. నిష్క్రమించు /  మార్చు )

Connecting to %s

వర్గాలు

%d bloggers like this: