వ్రాసినది: శ్రీవాసుకి | ఫిబ్రవరి 14, 2010

శివ శివా…ఏల ఈ గోల..

చక్కని కోయిల రాగాల నడుమ కాకి అరుపుల గోల వింటే ఎలా ఉంటుంది. మహాశివరాత్రి పర్వదినాన హరహర మహాదేవ అనే శివ నామస్మరణల మధ్య మందుబాబుల గోల కూడా అలాగే అనిపించింది. శివరాత్రి కదా అనిచెప్పి మాకు దగ్గరలో ఉన్న పట్టసాచలం (పట్టిసీమ) గ్రామంలో గోదావరి నది మధ్యలో ఉన్న చిన్న కొండపై వెలిసిన శివ దేవుని దర్శనానికి వెళ్ళాము. చుట్టూ గోదావరి దాని మధ్యలో ఉన్న ఇసుక మేటల నడుమ ఉంటుంది శ్రీ వీరభద్రస్వామి వారి ఆలయం. పట్టిసీమ గోదావరి ఒడ్డున లాంచీ ఎక్కితే నది మధ్యలో ఉన్న ఇసుక తిప్పల వద్ద ఆపుతారు. అక్కడి నుండి స్వామి వద్దకు నడుచుకొంటూ వెళ్ళాలి. ఈ మార్గం మధ్యలో దారి పొడుగునా అనేకమైన రకరకాల దుకాణాలుంటాయి. ఇసుక తిప్పలంతా చక్కని విద్యుత్కాంతులతో దేదీప్యంగా ఉంటుంది.

లాంచీ ఎక్కేచోట బాగా రద్దీగా ఉంటుంది. అందరూ వరసలో వెళ్ళి ఎక్కాలి. ఒకవైపు చాలా పెద్ద వరుస సిద్ధంగా ఉంది. మరోప్రక్క పద్ధతి పాడు లేకుండా ఒక గుంపు ఒకర్నొకరు తోసుకుంటూ వచ్చింది. వారంతా కాలేజ్ వయసు కుర్రాళ్ళే, మద్యం త్రాగి వచ్చారు. పోలీసులు ఎంత వారించినా వారు వినకుండా ముందుకు పోవడానికి ప్రయత్నించారు. దానితో పోలీసులు లాఠీలతో కొట్టడం మొదలుపెట్టారు. దానితో అందరూ చెల్లాచెదురయ్యారు. కాని మళ్ళీ రావడం పోలీసుల్ని రెచ్చగొట్టడం వాళ్ళు మళ్ళీ కొట్టడం. ఈ తంతు సుమారు రెండు గంటలపాటు కొనసాగింది. ఈ తోపులాటలో వరుసలో నిలబడినవారి మీద పడటంతో కొందరికి దెబ్బలు తగిలాయి. ఆ వరుసలో నిలబడిన నాకు ప్రక్కకి పడిపోవడంతో మోకాలు బెణికింది. ఆఫీస్ అయ్యాక రాత్రి 8 గం,కు వెళ్ళిన నాకు 11.30 గం కు కాని లాంచీ ఎక్కడం సాధ్యం కాలేదు. అదృష్టం ఏమంటే అంతకు ముందురోజే మా కుటుంబ సభ్యులు అక్కడికి వెళ్ళిపోయారు. లేకపోతే చాలా ఇబ్బంది పడుదురు. ఇంక అక్కడున్న ఆడవారి పరిస్థితి అయోమయం అయిపోయింది. ఎటూ వెళ్ళలేక పిల్లలతో ఉన్నచోటనే ఉండిపోయారు. మొత్తం మీద పోలీసులు అందర్ని ప్రయాస మీద రేవు దాటించారు. ఈలోపు అవతల రేవులో జనం ధాటికి ఒడ్డున ఉన్న పంటు మునిగిపోయి దానిమీద నిలబడ్డ వారు లాంచీ ఎక్కే ప్రయత్నంలో పడిపోయారు. కాని ఎవరికి ఏమి కాలేదు.

అక్కడున్న ఇసుక తిప్పలలో వివిధ సంఘాలవారు ఉదయం నుండి ఉచిత అన్నదాన కార్యక్రమం చేస్తున్నారు. ఉదయం నుండి రాత్రి 12 వరకు అన్నదానం విరివిగా జరిగింది. తర్వాత పూర్తయింది. రాత్రి 1 గంటకు ఒక మందుబాబుల గుంపు వచ్చి అన్నం పెట్టమని మా పందిరి వద్ద ఒకటే గొడవ. కొద్దిగా ఉంటే జాగ్రత్తగా అందరికి సర్దిపెట్టాము. వారు తినేసి కూడా తెచ్చుకున్న మందు సీసాలు త్రాగేసి పందిరిలోకి విసరడం మొదలుపెట్టారు. పైపెచ్చు ఇక్కడే పడుకొంటామని గోల. ఆడవారి కోసం కట్టిన తాటాకు స్నానపు గదుల ఆకులు పేకేసి చలి మంట వేసుకున్నారు. మా కూడా ఉన్న ఆడవారు, పిల్లలు భయపడిపోయారు. ఒక అరగంటసేపు వారితో తీవ్ర మాటల యుద్ధం కొనసాగించాము. ఈలోపు కొంతమంది పోలీసుల్ని పిలుచుకొచ్చారు. దానితో తొట్టిగుంపు అక్కడి నుండి పరారయ్యింది. చాలాసేపు అందరికి నిద్ర కరువైంది. ఈలోపు తెల్లారింది. హమ్మయ్య అని ఊపిరి పీల్చుకొన్నాము.

కాని నా మనసుకి ఒకటనిపించింది పవిత్రమైన క్షేత్రంలో కూడా ఇలాంటివి తప్పవా అంపించింది. ఆలయ దర్శనాలకు వెళ్ళినప్పుడు కొన్ని నియమ నిబంధనలుంటాయి కదా వాటిని తెలుసుకొని అందరూ పాటించాలి కదా. కాని అలా జరగటలేదు. ఆలయాలకు కూడా పిక్నిక్ లా వచ్చేవారు ఎక్కువయ్యారు. మనసులోగాని, చేతలలోగాని ఎక్కడా భక్తి లేదు. ఏమిటో ఇది. శివ శివా…ఏల ఈ గోల..


Responses

 1. daiva kshetraalapatla nirlaskhyam ,ekkuvamdi
  manakemduku ani bhaktulu evari darsanam vaallu chesukuni vellatam ituvamti dourbhaagyulaku chulakanai poyimdi mana kshetraalamte

  • మీ ప్రతి స్పందనకు ధన్యవాదాలు. మీరన్నది నిజమే. క్షేత్రం పట్ల గౌరవం లేకపోవడం, సరైన నియమ నిబంధనలు తెలుసుకోకపోవడం వల్ల వచ్చే అనర్థం.

 2. అసలే మనం భగవంతునిపై దృష్టి మరల్చాలంటే చాలా కష్టపడుతూ ఉంటాం. ఇక అలాంటి అపశృతులు జరిగితే మనం ఎంత కాదనుకున్నా.. మనసు ఒకచోట ఉండదు. మహాశివరాత్రి నాడు ప్రశాంతంగా గడపాలనుకున్న మీకు ఇలా జరగడం దురదృష్టకరం.

  • మీ ప్రతి స్పందనకు ధన్యవాదాలు. మాములు బాధ కాదు. అన్నదాన సేవా కార్యక్రమంలో పాల్గొనాలన్న నా కోరిక నెరవేరలేదు. ఈలోపు చుక్కలు కనిపించాయి. వెళ్ళకుండానే శివుడు కనిపించాడు.

 3. దరిద్రులు ఎక్కడ చూసినా తాగుబోతుల గోలే. పండుగంటే భక్తి పరవశంతో ఊగిపోవాలిగానీ ఇలా తాగి ఊగడమేంటో అర్థంకాదు.పోనీ తాగి ఊరుకుంటారా అంటే అదీలేదు మళ్ళీ సీను create చేస్తుంటారు.

  • మీ ప్రతి స్పందనకు ధన్యవాదాలు. అసలు ఇలాంటి సమయాలలో ఆలయ కమిటీ, పోలీసులు కలిసి ప్రత్యేక నిఘా వేయాలి. భక్తులకు అసౌకర్యం రాకుండా చూసుకోవాలి. ప్రతి సంవత్సరం వచ్చే పర్వదినం కనుక ముందే జాగ్రత్త పడాలి. కాని అలాంటిదేమి లేదు.

 4. మండలం రోజులంటె నలభై రోజులు. నలభై రోజులు ఒక క్రమ పద్ధతిన పాటించిన వారు అదే క్రమంలొ దిన వారీ కార్య్క్రమాలకు అలవాటు పడతారు,పాత చెడు అలవాట్లు వుంటే పొతాయని నమ్మకం..అంటె తాగేవాడు త్రాగుడు మానాలి .వ్యభిచారి వ్యభిచారం మానాలి . యిలా యీ నలభై రోజులలో ఆచరించిన ,క్రమ పద్ధతులు ,విధానాలు అలవడాలి.
  కాని కొందరు భక్తులు మాల వేసుకొని నిష్టగానే వుంటారు కాని దర్శనానికి వెళ్ళి వచ్చిన తరువాత పూర్వపు విధానాలు మళ్ళీ మొదలు.చిత్త శుద్ధిలేని శివపూజలేలరా అని అభిరాముడు వట్టిగా అనలేదు. యిక పోతే ఆదాయం వచ్చే వనరు కదా అని ………ప్రభుత్వాలకే చిత్త శుద్ధి లేకుంటే యేం చేస్తాం?.

  • మీరన్న ఆ నలభై రోజులను అతికష్టం మీద భరించి ఇంటికొచ్చేదాకా కూడా ఆగలేక సగం దారిలోనే మద్యపాన సేవనం చేసి మరీ తరిస్తున్నారు. దీక్ష తీసుకోవడం ఇప్పుడు ఒక మ్రొక్కుబడి తంతు. ప్రతి సంవత్సరంలాగే ఈ సంవత్సరం కూడా అంతే. అంతకు మించి ఏమిలేదు.


స్పందించండి

Fill in your details below or click an icon to log in:

వర్డ్‌ప్రెస్.కామ్ లోగో

You are commenting using your WordPress.com account. నిష్క్రమించు /  మార్చు )

గూగుల్ చిత్రం

You are commenting using your Google account. నిష్క్రమించు /  మార్చు )

ట్విటర్ చిత్రం

You are commenting using your Twitter account. నిష్క్రమించు /  మార్చు )

ఫేస్‌బుక్ చిత్రం

You are commenting using your Facebook account. నిష్క్రమించు /  మార్చు )

Connecting to %s

వర్గాలు

%d bloggers like this: