వ్రాసినది: శ్రీవాసుకి | ఫిబ్రవరి 12, 2010

ఆంధ్రావుడ్….తెలంగాణావుడ్

కె.సి.ఆర్ లెక్క ప్రకారం టాలీవుడ్ గా పిలువబడే తెలుగు సినిమా ఇండస్ట్రీ రెండుగా విడిపోయింది.        అదెలాగంటే    ఆంధ్రావుడ్,    తెలంగాణావుడ్.

కొన్ని సినిమాలు తెలంగాణా భాషలోకి డబ్ అయ్యాయి

 నరసింహనాయుడు —- నర్సింగ్ యాదవ్

పరుగు —- ఉరుకు

అక్కడ అమ్మాయి ఇక్కడ అబ్బయి — ఆడ పోరి ఈడ పోరగాడు

సిద్దు ఫ్రం శ్రీకాకుళం — మల్లేష్ ఫ్రం మల్కాజ్ గిరి

ఔనన్నా కాదన్నా —  ఔ

(ఎస్.ఎం.ఎస్ ఆధారం గా వ్రాసినది.)

 

పాణిని మహర్షి:

ఇంగ్లాండ్ లో శాస్త్రవేత్తలంతా కలిసి ప్రపంచ భాషలని అధ్యయనం చేసిన తర్వాత తెల్సుకున్న విషయం సంస్కృత వ్యాకరణం కంప్యూటర్ లాంగ్వేజికి అనుకూలంగా ఉంటుందని. అది కూడా పాణిని అనే మహర్షి వ్రాసిన అష్టాధ్యాయి అనే వ్యాకరణం గ్రంథం. ఈయన క్రీ.పూ. 7వ శతాబ్దికి చెందినవాడు. మాహుర్ అనే పట్టణంలో జన్మించాడు. ప్రస్తుతమిది పాకిస్థాన్లో ఉంది. ఇతడు పుట్టుకతోనే తెలివైన వాడు కాదట. మందమతిగా ఉండేవాడు. తండ్రి ఇతనిని విద్యాభ్యాస నిమిత్తం గురుకులంలో చేర్పించాడు. మందమతి కావడం వల్ల చదువొచ్చేది కాదు. అతనిని భరించలేక, అతడి వల్ల మిగతా పిల్లలు కూడా పాడవుతారని గురువుగారు అతడిని ఆశ్రమం నుండి పంపిచేశారు. అతడు బాధతో ఇంటికి వెళ్ళక హిమాలయాలకు పోయి శివుని కోసం తపస్సు ప్రారంభించాడు. కొంతకాలానికి శివ దర్శనం అయి ఆయన 14సార్లు మ్రోగించిన ఢమరుక నాదము అతడికి 14 సూత్రాలుగా వినిపించాయి. దానితో అతడు కావ్య రచన చేశాడు. అలా అతడు వ్రాసినదే అష్టాధ్యాయి సంస్కృత వ్యాకరణ గ్రంథం. నిన్న టి.టి.డి ఛానల్లో చూసిన ప్రోగ్రాం ఇది. సగం నుండి చూడటం వలన పూర్తి వివరాలు తెలియలేదు. అయినా ఇది వ్రాయడానికి కారణం అతడు రచించిన సంస్కృత వ్యాకరణం నేటి కంప్యూటర్ లాంగ్వేజి తయారీకి అనుకూలంగా ఉండటమే. భారతీయ విజ్ఞానానికి లభిస్తున్న గుర్తింపు ఇది.

స్పందించండి

Fill in your details below or click an icon to log in:

వర్డ్‌ప్రెస్.కామ్ లోగో

You are commenting using your WordPress.com account. నిష్క్రమించు /  మార్చు )

గూగుల్ చిత్రం

You are commenting using your Google account. నిష్క్రమించు /  మార్చు )

ట్విటర్ చిత్రం

You are commenting using your Twitter account. నిష్క్రమించు /  మార్చు )

ఫేస్‌బుక్ చిత్రం

You are commenting using your Facebook account. నిష్క్రమించు /  మార్చు )

Connecting to %s

వర్గాలు

%d bloggers like this: