వ్రాసినది: శ్రీవాసుకి | ఫిబ్రవరి 9, 2010

తెలుగు త్రొక్కిడి

చిన్ననాటి విషయాలు చెప్పుకోవడం ఎప్పుడూ సరదాగానే ఉంటుంది. అందులో స్కూల్ విషయాలు అయితే మరీను. అందునా తెలుగు పాఠాలైతే వినసొంపుగా ఉంటాయి. 9 వ తరగతిలో మా తెలుగు మాస్టార్ చెప్పే పాఠాలు నవ్వు తెప్పించేవి. ఆయన కొన్ని పదాలని కావాలని వత్తి వత్తి పలుకుతూ సాగదీస్తూ మాట్లాడేవారు . మధ్యహ్నం భోజన విరామం తర్వాత వుండే ఆయన క్లాస్ అంటే మా అందరికి ఇష్టం. సంధులు, సమాసాలను, ఛందస్సును ఆయన చాలా సులువైన ఉపమానాలతో చెప్పేవారు. పద్యాలు రాగయుక్తంగా పాడేవారు. ఒకరోజు పాఠం చెబుతూంటే ఒకచోట తొడత్రొక్కిడి అనే పదం వచ్చింది. దానికి అయన స్వరం మార్చి హాస్యంగా సాగదీస్తూ ఒరేయ్ అబ్బాయి తొడ త్రొక్కిడి అంటే ఒకరి తొడలు ఒకరు త్రొక్కుకోవడం కాదమ్మ, అంత రష్ గా ఉందని అర్థం, మనం తీర్థాలకు పోయినప్పుడు కాలు తీసి కాలు వేయలేం కదా అదన్నమాట అనేవారు. ఆయన మాటలో చమక్కులు, చతురత ఉండేవి. అవి మమ్మల్ని పాఠాలు వినేలా కట్టిపడేసేవి. మా మాస్టారి మాటలు నాకు బాగా నచ్చేవి. నా స్నేహితులతో మాట్లాడేటప్పుడు నేను కూడా మాట చమత్కారం చూపిస్తూంటాను. అలా అలవాటైపోయింది మరి.


స్పందించండి

Fill in your details below or click an icon to log in:

వర్డ్‌ప్రెస్.కామ్ లోగో

You are commenting using your WordPress.com account. నిష్క్రమించు /  మార్చు )

గూగుల్ చిత్రం

You are commenting using your Google account. నిష్క్రమించు /  మార్చు )

ట్విటర్ చిత్రం

You are commenting using your Twitter account. నిష్క్రమించు /  మార్చు )

ఫేస్‌బుక్ చిత్రం

You are commenting using your Facebook account. నిష్క్రమించు /  మార్చు )

Connecting to %s

వర్గాలు

%d bloggers like this: