వ్రాసినది: శ్రీవాసుకి | ఫిబ్రవరి 5, 2010

ప్రళయ కావేరి

పులికాట్ సరస్సు ఎక్కడ వుంది అంటే అందరూ ఠక్కున నెల్లూరు అని చెప్పేస్తారు. అదే ప్రళయ కావేరి ఎక్కడ వుందని అడిగితే మొహంలో ప్రశ్నార్థకం చూపిస్తారు. నెల్లూరు జిల్లా నుండి తమిళనాడు వరకు 431 కి.మీ విస్తరించి ఉన్న భారతదేశం లో రెండో అతి పెద్ద ఉప్పు నీటి సరస్సు ప్రళయ కావేరి. పులికాట్ అసలు పేరు ఇదే. ఎంతో అందమైన పేరు. మన పూర్వీకులు పెట్టిన అద్భుతమైన పేరు. తమిళులు దీనిని పులియ కావేరి (ఈ పదం మీద నాకు కొంచెం సందేహం) అని పిలుస్తారు. పలకడం చేతగాని నాలుక మందం బ్రిటిష్ వారు దీనిని పులికాట్ గా మార్చేశారు. మన గొర్రె తల నాయకులు దానినే ఖాయం చేసేశారు. అప్పటి నుండి మనము అంతే.
రష్యా లోని సైబీరియా ప్రాంతం మరియు విదేశాల నుండి వచ్చే వలస పక్షులతో ఈ ప్రాంతం ఎంతో అందంగా ఉంటుంది. కొంగ జాతుల్లోని రకాలన్ని కనబడతాయి. ఈ సరస్సు మధ్యలో ఎన్నో దీవులు, ఆ దీవులలో జనవాసాలు ఉన్నాయి. ఇక్కడున్న నేలపట్టు అనే ఊరు ఈ వలస పక్షులకి ప్రసిద్ద ఆవాస ప్రాంతం. ప్రతి సంవత్సరం నవంబర్, డిసెంబర్ నెలల్లో ఇక్కడ నెల్లూరు జిల్లా కలెక్టర్ చేతుల మీదుగా పులికాట్ (ప్రళయ కావేరి) వారోత్సవాలు జరుగుతాయి. చాలా బాగుంటాయి. శ్రీహరికోట అంతరిక్ష కేంద్రం ఈ ప్రళయ కావేరి ని మరియు బంగాళాఖాతాన్ని విడదీస్తూంటుంది. సూళ్ళూరుపేట నుండి చెన్నై వెడుతూంటే మనకి ఎడమవైపు దూరంగా ప్రళయ కావేరి నీలంగా కనబడుతూ ఉంటుంది. ఒకసారైనా అక్కడికి వెళ్ళి చూసిరావల్సిందే. శీతాకాలం అసలైన సమయం.

Responses

  1. శ్రీ వాసుకి గారూ, పులికాట్ సరస్సు పరిచయం బాగుంది.పాఠాలలోనో, దిన పత్రికలలోనో పక్షులు వలస వచ్చినప్పుడొ హెడ్డింగ్ చూసి వదిలివేయడమే కాని, పూర్తి గా వివరాలు తెలుసుకు కోవడానికి ప్రయత్నించం.నా వరకు మీ ప్రయత్నం సఫలమయ్యింది. సీనరీ చాల బాగుంది….నూతక్కి.

    • మీరన్నది నిజమే. ప్రతి సంవత్సరం వినేదే కదా అని అనుకోవడం వల్ల కొన్ని విషయాలు మరుగున పడిపోతాయి. నేను కూడా పులికాట్ గురించి 3,4 సంవత్సరాల్ క్రితం ఆంధ్రభూమి దిన పత్రికలో చదివాను. అది గుర్తొచ్చే ఇప్పుడు వ్రాసాను. “ప్రళయ కావేరి” అనే ఒక అందమైన పేరు ఇన్నాళ్ళు మనకి తెలియకుండా పోయింది కదా అని నా బాధ.

  2. hi. site adhurs.baagumdi


స్పందించండి

Fill in your details below or click an icon to log in:

వర్డ్‌ప్రెస్.కామ్ లోగో

You are commenting using your WordPress.com account. నిష్క్రమించు /  మార్చు )

గూగుల్ చిత్రం

You are commenting using your Google account. నిష్క్రమించు /  మార్చు )

ట్విటర్ చిత్రం

You are commenting using your Twitter account. నిష్క్రమించు /  మార్చు )

ఫేస్‌బుక్ చిత్రం

You are commenting using your Facebook account. నిష్క్రమించు /  మార్చు )

Connecting to %s

వర్గాలు

%d bloggers like this: