వ్రాసినది: శ్రీవాసుకి | జనవరి 30, 2010

వేరు కుంపటి సెగలు…నాయనో

తెలంగాణ వచ్చుడో కె.సి.ఆర్ సచ్చుడో అని కె.సి.ఆర్ గారు సెలవిచ్చారు.ఆ మాటకి అఖిలాంధ్ర జనం లోలోన నవ్వుకున్నారు,వదిలేసారు.  కాని ఒకరు మాత్రం ఉలిక్కి పడ్డారు. చుట్టూ ఎప్పుడూ వందిమాగధులతో, వేయి కనులతో డేగ చూపులు చూస్తో అదీ చాలక నమ్మకస్తులైన వార్తాచారుల వార్తలు వింటూ కూడా నిజమే కాబోలనుకొని కంగారు పడ్డారు. ఆ భయానికి కారణం పేరేన్నికగన్న వైద్య మహాశయులు కూడా ఇక రేపో మాపో అన్నట్టుగా ఉంది పరిస్థితి అని భయపెట్టేశారు. రాజకీయ నాటకాలు తెలిసిన జనం మాత్రం నెమ్మదిగానే ఉన్నారు. కాని పాపం   ఏ కల్మషం తెలియని అధిష్టాన దేవతగారు మాత్రం వైద్యో నారాయణో హరి అన్నారు కదా అని చెప్పి వాళ్ళు పలికిన చిలక పలుకులు నిజమే అని నమ్మి (నమ్మారో లేదో ఎవడికి తెలుసు) తెగ ఇదైపోయారు. ఏదో ఒకటి చేసేసి సదరు శాల్తీని రక్షించుకోవాలనుకొన్నారు. పనిలో పని ఒకే దెబ్బకి రెండు పిట్టలన్నట్టు తన జన్మదిన కానుకగా వేరు కుంపటి అనే ప్రక్రియ మొదలుపెడుతున్నట్టు నడిరేయి చిదంబరం మహాశయుని చేత చిద్విలాసంగా పలికించారు. తద్వారా తన జన్మదిన సందర్భంగా ఆంధ్రప్రదేశ్ కేక్ ని  కోసి పండగ చేసుకొన్నారు. అంతే ఆంధ్ర అంతా అగ్నిహోత్రం వెలిగింది. దానికి ప్రతి ఒక్కరు నేను సైతం సమిధనొకటి ఆహుతినిస్తానంటూ తయరై రాష్ట్రాన్ని రావణకాష్టంగా మార్చారు. దీనిని ఎవరి స్వలాభానికి వారు ఉపయోగించుకొంటున్నారు. ముందునుండి అనుకూలమని చెప్పి తీరా సమయమొచ్చేసరికి నాలుక మడతతిప్పాయి కొన్ని పార్టీలు.  ఆ బుద్దేదో ముందే ఉండి ఏడవొచ్చుగా, అసలు ఇంత గొడవే ఉండకపోను.

తమ స్వార్ధం కొసం ముందు ఒకమాట తర్వాత ఒకమాట. పోని అలాగైనా బుద్దిగా ఉన్నారా అంటే అదీ లేదు సీమాంధ్ర, తెలంగాణ పార్టీలు అంటూ రెండుగా విడిపోయి నాటకాలు మొదలుపెట్టారు. ప్రశాంతంగా ఉన్న ప్రజల మధ్య లేనిపోని గొడవలు, అఖాధాలు  సృష్టించారు. సొంత రాష్ట్రంలోనే కావల్సిన చోటకి వెళ్ళలేక భయం భయంగా బ్రతికే పరిస్థితి. ప్రజలలో ఒకరిపై ఒకరికి నమ్మకం పోతోంది. ఎందుకొచ్చిన గొడవలు,ప్రశాంతంగా అందరం కలిసిమెలిసి ఉండక. విడిపోవడానికి చాలా కారణాలు చూపించవచ్చు హాయిగా విడిపోవచ్చు. కాని ఒకసారి విడిపోయిన మనసులు తర్వాత మళ్ళీ కలవాలంటే కష్టమే. దానికి గొప్ప మనసు ఉండాలి. దాయాదుల పోరు మంచిది కాదు.

200 సంవత్సరాలు బానిస బ్రతుకు బతికాము. అది చాలదన్నట్టు మళ్ళీ ఇప్పుడు ఒక విదేశి మహిళ చెప్పు చేతల్లో ఉన్నాము. ఆమె ఎంత చెబితే అంత ఎదురు తిరిగితే అంతే. పదవి ఉండదు, పార్టీ సీటు ఉండదన్న భయం. స్వాతంత్ర్యం తర్వాత కూడా మనకి ఈ విదేశి పాలన తప్పదా? పేరు గొప్ప ప్రధాని ఉన్నా లేనట్టే. వెనుక ఉండి చక్రం తిప్పే దేవత ఈవిడేగా. అసలు ఇన్ని కోట్లమంది భారతీయులలో దేశాన్ని పాలించగల ఒక నాయకుడుగాని, నాయకురాలుగాని లేరా. ఉత్తరాంధ్రలో పుట్టిన కె.సి.ఆర్ కి అసలు ఎందుకు తెలంగాణ గొడవ. రాత్రికి రాత్రి ముఖ్యమంత్రి అయిపోవాలన్న కోరిక తప్ప. కేంద్రంలో మంత్రిగా ఉన్నప్పుడు రాష్ట్రానికి గాని, తెలంగాణాకిగాని చేసిందేముంది. ఒకవేళ ప్రత్యేక రాష్ట్రం వస్తే తను ముఖ్యమంత్రి అవుతాడు తర్వాత కొడుకునో, కూతుర్నో ముఖ్యమంత్రి చేస్తాడు. చివరికి జనాలకు మిగిలేది వేరుకుంపటి తాలూకూ సెగలు మాత్రమే. ఇదంతా పేరు గొప్ప స్వార్ధ రాజకీయం తప్ప మరేమి కాదు. ప్రియ మిత్రులారా ప్రాంతీయ అసమానతలు పోవాలంటే అభివృద్ది జరగాలి, దానికోసం అందరం కలిసి ఉద్యమిద్దాం. అసమానతలు అన్ని ప్రాంతాలలోను ఉన్నాయి. ఒక్క తెలంగాణకే పరిమితం కాదు. ఏ ప్రాంతం సంపూర్ణ అభివృద్ధి చెందలేదు. ఇదంతా కేవలం ఒక కుట్ర ప్రకారం మన రాష్ట్ర భవిష్యత్ ని, ప్రజల ఆత్మ గౌరవాన్ని దెబ్బ తీయడం. ఐదు వేళ్ళు కలిసి ఉంటేనే పిడికిలికి బలం. మనం ఎవ్వరం ఈ బలాన్ని కోల్పోవద్దు.

రాజకీయం అంటే
రా – రాబందుల్లా
జ – జనానికి
కీ – కీడు చేసే
యం – యంకింకరులు  అని అర్థం.

ఇది ఒక తెలుగు సినిమాలోని డైలాగ్. కాని నిజమేమంటే రాబందులు మనిషికి మేలే చేస్తాయి. రాజకీయ నాయకుల్లా కాదు.


Responses

  1. “దానికి ప్రతి ఒక్కరు నేను సైతం సమిధనొకటి ఆహుతినిస్తానంటూ తయరై రాష్ట్రాన్ని రావణకాష్టంగా మార్చారు”.
    వాస్తవం చెప్పారు.

    కాని యెన్నో సందర్భాల్లో చేప్పాను ద్రుష్టి పెట్టటానికి యెవరూ సిద్ధంగా లేరు…….

    కేంద్రం లక్షలకోట్ల రూపాయలు వుమ్మడి పద్దులోవెచ్చించి, ఆంధ్రప్రదేశ్ రాజధానీ నగరం హైదరాబాద్ నగర పరిసరాలలో అయిదు జిల్లాల పరిధిలో స్థాపించి ,కేంద్రీకరించిన కేంద్రప్రభుత్వ రంగ భారీ పరిశ్రమలు, ల్యాబులూ, ఇంటర్నేషనల్ ఎయిర్పోర్టూ,లక్షల వుద్యోగాలూ అయ్.అయ్.టి,కేంద్ర విశ్వవిధ్యాలయం,బిజినెస్ మేనేజ్మెంటు స్కూలు, యివే కాక , సినీ రంగం,వీటన్నింటిపై ఆధారపడిన యితర అనుబంధ పారిశ్రామిక వుపాధి రంగం,తద్వారా లక్షలాది వుద్యోగాలూ,వారి నిత్యావసరాలు సమకూర్చే లక్ష్యంలోనిత్యజీవన వ్యాపార రంగం లో నిమగ్నమై, వుపాధిపొందుతూ లక్షలాది కుటుంబాలూ పరస్పరసహకారం తో ముడివడి,యిదంతా ఓ పెద్దగొలుసు వ్యవహారం.యిక్కడ దేశం వివిధ ప్రాంతాల నుండి వచ్చిన పరిశ్రమల అధినేతలుఎంతో వ్యయ ప్రయాసలకోర్చి ఎన్నెన్నో పరిశ్రమలు స్థాపించారు. స్థానికులకు వుపాధి కల్పించారు. అందువల్ల స్థానికుల ఆర్ధిక స్థితి గతులు గణనీయంగా మెరుగుబడ్డాయి. యీ మహత్తర కార్యంలో ఎంతోశ్రమధనాదులకోర్చిసీమాంధ్రులు స్థాపించిన పరిశ్రమలలో స్థానిక యువకులు ఎందరో వుపాధిపొంది,ఎన్నో స్థానిక కుటుంబాలు తమ సామాజిక స్థితిగతులు మెరుగు పరుచుకున్న విషయం మరువగూడని సత్యం.సాఫ్ట్వేర్ రంగంలోనూ అదే పరిస్థితి.
    భాగ్యనగరి పరిసరాలలో పారిశ్రామిక కేంద్రీకరణ వుపాధికి మూలమైన కీలక వ్యవస్త,యీ వ్యవస్త యిక్కడే వుండటంవల్లనూ,పరిశ్రమలు విభజించుకొని తరలించలేము కాబట్టి, రాష్ట్రం కలసి వుండాలని కోరడానికి ఓ ప్రధాన కారణమైతే ,గత యాభై సంవత్సరాలుగా సీమాంధ్ర లోని గ్రామ గ్రామాన వున్న కుటుంబాలకు భాగ్యనగరంతో యేర్పడిన, పెనవేసుకుపోయిన ఆత్మీయ అనుబంధం,సామాజిక విధి విధానంలో భాగ్యనగరం ఒక జీవన భాగం కావడం మరో కారణం.భాగ్యనగర అభివ్రుద్ధి అన్ని రంగాలలోనూ,అన్ని ప్రాంతాలవారి భాగస్వామ్యంతోనే జరిగింది కాని ఒక్క తెలంగాణ వారి వల్ల మాత్రమే జరిగింది కాదు.(this matter is a part of my work to be posted to my blog.)


స్పందించండి

Fill in your details below or click an icon to log in:

వర్డ్‌ప్రెస్.కామ్ లోగో

You are commenting using your WordPress.com account. నిష్క్రమించు /  మార్చు )

గూగుల్ చిత్రం

You are commenting using your Google account. నిష్క్రమించు /  మార్చు )

ట్విటర్ చిత్రం

You are commenting using your Twitter account. నిష్క్రమించు /  మార్చు )

ఫేస్‌బుక్ చిత్రం

You are commenting using your Facebook account. నిష్క్రమించు /  మార్చు )

Connecting to %s

వర్గాలు

%d bloggers like this: