వ్రాసినది: శ్రీవాసుకి | జనవరి 29, 2010

అభిమాని గోడు భాగం-2

మొత్తంమీద ఉత్తరం సిద్దమయింది. నానాపాట్లు పడి దానిని తెలుగు నుండి ఇంగ్లీష్ లోకి మార్చాను. కానీ నా అనువాద ఉత్తరం అంటే నాకే భయం. చదవడానికి ధైర్యం చాలలేదు. కాని తప్పదు కదా. కాని ఒకటి నాకు అర్థం కాకపోయిన అక్కడి వాళ్ళకి అర్థం అయితే చాలనుకున్నాను. ఇప్పటికీ ఆ ఉత్తరం ప్రతి నా దగ్గర వుంది. చూసుకున్నప్పుడల్లా నా భాషా పాండిత్యానికి నాకే నవ్వొస్తుంది. సరే ఉత్తరం వ్రాయడమయితే అయింది కాని దానిని పంపడమెలాగో అర్థం కాలేదు. ఎందుకంటే నా దగ్గర జాకీచాన్ చిరునామా లేదు. దానికోసమని రకరకాల తెలుగు, ఇంగ్లీష్ సినిమా పుస్తకాలు కొని వెతికాను. ప్చ్..లాభం లేదు. పిన్ కోడ్ ఉంటే ఉత్తరాలు సరిగ్గా వెడతాయన్న నమ్మకంతో మా ఊరి పోస్ట్ మెన్ ని కలిసి హాంకాంగ్ కోడ్ అడిగా కాని ప్రయోజనం శూన్యం. అదిగో సరిగ్గా అప్పుడే నా మాస్టర్ బ్రెయిన్ కి ఒక ఆలోచన తట్టింది. జాకీచాన్ పెద్ద పేరున్న నటుడు కదా ఆపేరు, దేశం పేరు వ్రాసి పంపిస్తే పోలే అనుకొని ఉత్తరం కవరు మీద జాకీచాన్, హాంకాంగ్, ఆసియా అని వ్రాసి పోస్ట్ చేసాను. ఇది మార్చి, 1995 లో జరిగింది. ఆ తర్వాత కొన్ని రోజులకి ఉత్తరం పంపిన విషయం కూడా మర్చిపోయాను.తలాతోక లేకుండా వ్రాసిన ఉత్తరం, పైపెచ్చు చిరునామా లేదాయే. అది చదివిన వారికి అర్థమయితే గొప్ప. ఇక గుర్తుంచుకోవల్సిన పనేముంది. అందుకే మర్చిపోయా.

5 నెలలు గడిచిపోయాయి. నేను మర్చిపోయిన నేను పంపిన ఉత్తరం తన గమ్యం మర్చిపోలేదు. అది చేరాల్సిన చోటకే చేరింది. కలవాల్సిన వ్యక్తినే కలిసింది. తేవల్సిన సమాచారమే తెచ్చింది.5 నెలల తర్వాత నన్ను ఊహించనిరీతిలో అద్భుతాశ్చర్యాలకి గురిచేసింది. ఆగష్టు 1995 న అది వచ్చి నా చేతిలో వాలింది. నన్ను నేను నమ్మలేకపోయాను. ఒకటికి రెండుసార్లు దాని మీదున్న చిరునామా చూసుకున్నను. అనుమానం లేదు నాదే. తెల్లని కవరు మీద చుట్టూ ఆకుపచ్చని బోర్డర్, ఒక ప్రక్క హాంకాంగ్ దేశపు తపాల బిళ్ళలు, ప్రక్కనే నల్ల ఇంక్ పెన్నుతో వ్రాసిన నా చిరునామా. కెవ్వుమని ఒక కేక పెట్టాను. ఇంట్లోవాళ్ళు కంగారు పడ్డారు. ఉత్తరం లోపల చేతి దస్తూరితో వ్రాసిన లేఖ సారాంశం మరియు జాకీచాన్ స్వహస్తంతో తన చిత్రం మీద నా పేరు వ్రాసి పెట్టిన సంతకం మరియు సంవత్సరం పేరు. అది నేను అందుకున్న మొదటి ఉత్తరం. చుట్టు ప్రక్కల వాళ్ళకి, నా మిత్రులకి చూపిస్తే ఆశ్చర్యపోయారు. మా ఊర్లో అది గొప్పే మరి. ఎవరు ఊహించనది. అలా జాకీతో నా ఉత్తరాల అనుబంధం మొదలయ్యింది. ఇది నా మంచికే జరిగింది.

తెలుగు మాధ్యమంలో చదువుకున్న నాకు ఇంగ్లీష్ భాష వచ్చేలా చేసింది. తొలి రోజులలో మామయ్య సహకారం తీసుకున్నా, తర్వాత తర్వాత నాకు నేనుగా వ్రాయడం మొదలుపెట్టాను. అందుకోసం గ్రంథాలయానికి వెళ్ళి ఇంగ్లీష్ పేపర్లు చదివేవాడ్ని. అలా అలా ఆ భాష మీద పట్టు పెరిగింది. ఒక సంవత్సరం గడిచిన తర్వాత నాకు అనుకోకుండా ఒక ఉద్యోగ అవకాశం వచ్చింది. ఇంటర్వూ కాకినాడలో జరిగింది. ఎంపికయ్యాను కాని వెళ్ళడానికి భయపడ్డాను. కారణం ఉద్యోగం కేరళ లోని తిరువనంతపురం నగరంలో. చివరికి నా మిత్రుని ప్రోత్సాహంతో ఇంట్లో ఒప్పించి కేరళ వెళ్ళాను.

(ఇంకా ఉంది)


Responses

 1. You owe one to Jackie 🙂

  Interesting and funny. Where’s part one?

  • మీ అభిమానానికి కృతజ్ఞతలు. నా కథ నచ్చినందుకు ధన్యవాదాలు.
   మొదటి భాగం పేరు అభిమాని గోడు.
   రెండవ భాగం పేరు అభిమాని గోడు-2. ఇష్టాగోష్టి అనే వర్గంలో చూడండి. దీంట్లో వ్రాయాల్సింది ఇంకా ఉంది.


స్పందించండి

Fill in your details below or click an icon to log in:

వర్డ్‌ప్రెస్.కామ్ లోగో

You are commenting using your WordPress.com account. నిష్క్రమించు /  మార్చు )

గూగుల్ చిత్రం

You are commenting using your Google account. నిష్క్రమించు /  మార్చు )

ట్విటర్ చిత్రం

You are commenting using your Twitter account. నిష్క్రమించు /  మార్చు )

ఫేస్‌బుక్ చిత్రం

You are commenting using your Facebook account. నిష్క్రమించు /  మార్చు )

Connecting to %s

వర్గాలు

%d bloggers like this: