వ్రాసినది: శ్రీవాసుకి | జనవరి 26, 2010

పచ్చని సీమ

కోనసీమ తూర్పు గోదావరి జిల్లాలో గోదావరి పరీవాహక ప్రాంతంలోని త్రిభుజాకార ప్రదేశం. కోనసీమ నాలుగు వైపులా గోదావరి, బంగాళాఖాతాలు చుట్టుముట్టి ఉన్నాయి. కోనసీమ ప్రకృతి రామణీయకతకు చాలా ప్రసిద్ధి చెందింది. కోనసీమ పదం మూల (కోన) ప్రదేశం (సీమ) నుండి వచ్చింది. కోనసీమకు సరిహద్దులుగా ఉత్తరం వైపు గోదావరి పాయ అయిన గౌతమి’, దక్షిణం వైపున వశిష్ట అనే గోదావరి పాయ ఉన్నాయి ప్రధాన వృత్తి వ్యవసాయం.  ఈ ప్రాంతం పురాతన ఆంధ్ర సంస్కృతీ సాంప్రదాయాల నిలయం. ఇక్కడ ఇంకా అంతరించని కొన్ని ఆంధ్ర సాంప్రదాయాలు చూడవచ్చు. అతిధి, అభ్యాగతులను ఆదరించడం, పండుగలను, పబ్బాలను సాంప్రదాయానుసారంగా నిర్వహించడం ఇక్కడ గమనించవచ్చు. అలాగే ఇక్కడి వారు కొత్తవారిని  “అండీ, ఆంయ్ ” అంటూ ఒక ప్రత్యేక శైలిలో ఆప్యాయంగా పలకరించడం చూడవచ్చు. కోస్తాతీరంలో ఆత్యంత సారవంతమైన ప్రదేశం. కోనసీమలో పండించని పంట కానరాదు. పలురకలైన కొబ్బరి మొదలు, అరటి, మామిడి, పనస, సపోటా, బత్తాయి ఇలా పలురకాలు కానవస్తాయి. ఇవేకాక అన్ని రకాల కూరగయలు, పూలమొక్కలు, లంక గ్రామప్రాంతాలలో విస్తారంగా పండిస్తారు.

ఆగస్ట్ నెలలో ఈ ప్రాంతానికి వరద తాకిడి ఎక్కువ. 1996 లొ బంగాళాఖాతంలో వచ్చిన తుఫాన్ ధాటికి ఈ ప్రాంతంలో చాలా చోట్ల కొబ్బరిచెట్లు నేలకొరిగాయి, వరి పంటలు దెబ్బతిన్నాయి. దివిసీమ తర్వాత వచ్చిన పెద్ద తుఫాన్ ఇదే అనుకుంటా. ఆ తుఫాన్ ను ప్రత్యక్ష్యంగా చూసిన వాళ్ళలో నేను ఒకడ్ని. ఆ రాత్రి నిజంగా కాళరాత్రే. ఉదయం చూసేసరికి ఎక్కడికక్కడ తలలు తెగిన కొబ్బరిచెట్లు, మెలి తిరిగిన కరెంటు స్తంభాలు, పైకప్పులు ఎగిరిపోయిన పెంకుటిళ్ళు, మొండిగోడలు తోను, మొత్తం కూలిపోయిన పూరి పాకలు, చచ్చిన పశువుల కళేబరాలతో చాలా భీభత్సంగా అయిపోయింది. పచ్చని కోనసీమ కకావికలమైపోయింది. యధాస్థితికి రావడనికి చాలా కాలమే పట్టింది. ఇప్పుడు మళ్ళీ కోలుకుని పచ్చదనంతో ఎప్పటిలాగానే అందర్ని పరవశింపజేస్తోంది.

కోనసీమలో ఉన్న ప్రధాన ప్రదేశాలు అమలాపురం,రావులపాలెం,రాజోలు, ముమ్మిడివరం,ముక్తేశ్వరం, కొత్తపేట.   ఈ ప్రాంతంలో ప్రముఖ క్షేత్రాలు అప్పనపల్లి, అంతర్వేది, అయినవిల్లి, పలివెల,ముక్తేశ్వరం. రావులపాలెం కి మరోపేరు కోనసీమ ముఖద్వారం అని. ఇక్కడి నుండి కోనసీమ ప్రారంభం అవుతుంది. ఈ ఊరు రాజమండ్రి కి 35కిమీ దూరంలో వుంది. రాజోలు వద్దగల దిండి గ్రామంలో ఏర్పాటు చేసిన ఏ.పి.రిసార్ట్ వారి గోదావరి పడవ విహారం కేరళను తలపిస్తుంది. కనువిందు చేసే అరటి తోటలు, గోదావరి నది మధ్యలో వుండే లంకలు (దీవులు), తీరం వెంబడి కనిపించే పచ్చని కొబ్బరిచెట్లు.. అహొ చూసితీరాల్సిందే. అమలాపురంలో పొలాల గట్ల వెంబడి పోయే ఎద్దులబండ్లు వరుస అదంతా ఒక అందమైన అనుభూతి.బండారులంక గ్రామంలో నా చిన్ననాటి సంగతులు ఇప్పటికి నాకు గుర్తే. మా ఇంటి వెనకాల వున్న కొబ్బరి తోట ప్రక్కన చిన్న టూరింగ్ సినిమా హాలు వుండేది. అందులో రొజూ సాయంత్రం ఎన్.టి.ఆర్, ఎ.ఎన్.ఆర్ ల పాటలే. మా వీధిలో కొంతమంది మగ్గాలు నేసే వారు వుండేవారు. వీధులన్ని మగ్గలతో నింపేసేవారు. ఈ ప్రాంతంలో తాడి తాండ్ర , మామిడి తాండ్ర దొరుకుతాయి.ముగ్గిన తాటి కాయలతో చేసే రొట్టెలు భలే బాగుంటాయి.  ముంగండ గ్రామం వేద పండితులకు పేరు. గొప్ప వారైన పండితులకు, కవులకు ఇది ప్రసిద్ది. రాష్ట్ర ప్రభుత్వంచే గుర్తింపు పొందిన పంచాంగ రూపకర్త పొడగట్లపల్లి సిద్దాంతి పిడపర్తి సుబ్రమణ్యం గారు కూడా ఇక్కడి వారే. అసలు గోదావరి తీరప్రాంతమే కళలకు కాణాచి.


స్పందించండి

Fill in your details below or click an icon to log in:

వర్డ్‌ప్రెస్.కామ్ లోగో

You are commenting using your WordPress.com account. నిష్క్రమించు /  మార్చు )

గూగుల్ చిత్రం

You are commenting using your Google account. నిష్క్రమించు /  మార్చు )

ట్విటర్ చిత్రం

You are commenting using your Twitter account. నిష్క్రమించు /  మార్చు )

ఫేస్‌బుక్ చిత్రం

You are commenting using your Facebook account. నిష్క్రమించు /  మార్చు )

Connecting to %s

వర్గాలు

%d bloggers like this: