వ్రాసినది: శ్రీవాసుకి | జనవరి 25, 2010

జగన్మోహనుడు

ర్యాలి, తూర్పు గోదావరి జిల్లా, ఆత్రేయపురం మండలానికి చెందిన గ్రామము. ఈ గ్రామములో ప్రసిద్ధి చెందిన జగన్మోహిని కేశవ స్వామి దేవాలయం ఉన్నది. వసిష్ఠ, గౌతమి అనే గోదావరి ఉప పాయ ల మధ్య కలదు. ఇక్కడి విశేషం “శ్రీ జగన్మోహిని కేశవ స్వామి, శ్రీ ఉమా కమండలేశ్వర స్వామి” వారు ర్యాలి ప్రధాన రహదారి కి ఒకరికొకరు ఎదురెదురుగా ఉండడం.  శ్రీ మహాభాగవత ఇతిహాసం ప్రకారం క్షీరసాగర మధన సమయంలో అమృతం ఉద్భవించినప్పుడు దేవదానవులు పోరాడుకొనుచుండగా శ్రీమహావిష్ణువు లోకకళ్యాణార్థం జగన్మోహిని అవతారాన్ని ఎత్తి దేవతలకు అమృతాన్ని అందిస్తాడు. జగన్మోహిని అవతార సమయం లోమహేశ్వరుడు జగన్మోహిని ని చూసి మోహితుడై ఆమె వెంట పడగా వారి కలియక ఫలితంగా అయ్యప్ప స్వామి జన్మిస్తాడు. 

11 వ శతాబ్దం లొ ఈ ప్రాంతానికి అప్పటి చోళ రాజా విక్రమ దేవుడు వేట కై వచ్చి అలసి ఒక పెద్ద పోన్న చెట్టు క్రింద సేద తీరి నిద్రపోతాడు. శ్రీ మహావిష్ణువు కలలో కనిపించి రథం యెక్క మేకు క్రింద పడిన ప్రదేశం లొని భూగర్భం లొ తన క్షేత్రం ఉందని పల్కుతాడు. ఆ మహారాజు శ్రీ మహావిష్ణువు చెప్పినట్లు ఆ ప్రదేశాన్ని త్రవ్వించగా జగన్మోహిని కేశవ స్వామి విగ్రహం బయట పడుతుంది. అక్కడ ఆ మహారాజు ఒక దేవాలయాన్ని నిర్మిస్తాడు. 1936 సంవత్సరం లొ ఈ గుడికి ప్రాకారాలు నిర్మించబడ్డాయి.

శ్రీ జగన్మోహిని కేశవ స్వామి విగ్రహ రూపం:

5 అడుగుల ఎత్తు 3 అడుగుల వెడల్పు గల శ్రీ జగన్మోహిని కేశవ స్వామి వారి సాలిగ్రామ విగ్రహం శ్రీ మహావిష్ణువు ప్రత్యక్ష స్వరూపం. స్వామివారి ఈ విగ్రహము అతి సుందరమైనది. ప్రత్యేకముగా చెప్పుకోదగినది. ఈ విగ్రహము ఏక సాలిగ్రామ శిలతో తయారైంది. విగ్రహము ముందువైపు విష్ణువు కేశవస్వామి, వెనుకవైపున జగన్మోహినీ రూపంలో ఉన్నాడు. ఎదుటవైపుగా స్యామి పాదపద్మాల మద్య ఉన్న చిన్న గంగ దేవి తల నుండి గంగ నిరంతరం ప్రవహిస్తూ ఉంటుంది.(విష్ణు పాద్బోవీం గంగా). ముందువైపు విష్ణువు నాలుగు చేతులు కలిగి, శంఖము, చక్రము, గద మరియు అభయహస్తము హస్తరేఖలతో ఉన్నాడు. విగ్రహము పై బాగమున ఆదిశేషుడు నీడపట్టినట్లుగా ఉన్నాడు.  వెనుక వైపున ఇవేమీ కనుపించకుండా, రెండు చేతులు, చక్కటి జుట్టుముడి, అందమైన శరీరాకృతి, కుడికాలు పై పాదము నకు కొద్దిగా పైభాగము (పిక్క) పై నల్లని మచ్చతో ఉంటుంది.ఈ మచ్చ పద్మినీ జాతి స్త్రీ కి ఉండే లక్షణాలలో ఒకటిగా చెపుతారు. అసలే నల్లని సాలిగ్రామ శిలతో తయారైనా కూడా అంతకన్నా నల్లగా ఈ మచ్చ అతి స్పష్టంగా కనుపిస్తూ ఉంటుంది. మొత్తముగా ఈ విగ్రహము అత్యంత ప్రత్యేకమైనది మరియు అద్భుతమైనది.బహుశ ఇటువంటి విగ్రహము ఇది ఒక్కటే అని చెప్పవచ్చును. అందుకే స్వామివారికి జరిగే నిత్యపూజలు, హారతి, నైవేద్యాదులు ముందువైపు మరియు వెనుక వైపు కూడా యధావిధిగా జరుగుతాయి.

ర్యాలి రాజమండ్రి కి 40 కి.మి., కాకినాడ కు 74 కి.మి., అమలాపురం కి 34 కి.మి., రావులపాలెం కు 5 కిమీ దూరం లో వుంది.  చక్కని దేవాలయాలు చూడాలనుకొనేవారికి ఈ గుడి సరైనది. మరో విశేషం ఏమంటే ఈ ఆలయం గర్భగుడి లోపలికి వెళ్ళి మూల విరాట్టుని చూడవచ్చు. గర్భగుడి ప్రవేశం వున్న ఆలయం ఆ చుట్టుప్రక్క ప్రదేశాలలో ఇదే.


స్పందించండి

Fill in your details below or click an icon to log in:

వర్డ్‌ప్రెస్.కామ్ లోగో

You are commenting using your WordPress.com account. నిష్క్రమించు /  మార్చు )

గూగుల్ చిత్రం

You are commenting using your Google account. నిష్క్రమించు /  మార్చు )

ట్విటర్ చిత్రం

You are commenting using your Twitter account. నిష్క్రమించు /  మార్చు )

ఫేస్‌బుక్ చిత్రం

You are commenting using your Facebook account. నిష్క్రమించు /  మార్చు )

Connecting to %s

వర్గాలు

%d bloggers like this: